Chiranjeevi – Meher Ramesh : భోళాశంకర్ సినిమాకు దర్శకుడు మెహర్ రమేష్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

September 29, 2021 3:25 PM

Chiranjeevi – Meher Ramesh : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో నేటి తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాని కూడా మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

Chiranjeevi - Meher Ramesh : భోళాశంకర్ సినిమాకు దర్శకుడు మెహర్ రమేష్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Chiranjeevi – Meher Ramesh

తమిళ వేదాళం రీమేక్ సినిమాకు తెలుగులో భోళా శంకర్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. అయితే గతంలో షాడో, శక్తి వంటి సినిమాలను తెరకెక్కించి విఫలమైన మెహర్ రమేష్ కి ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండటం చేత చిరంజీవి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఈయన రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న మెహర్ రమేష్ నెల వారీ జీతంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నెలకు కేవలం ఐదు లక్షల రూపాయల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు. ఇక సినిమా విడుదలయ్యి లాభాలు వస్తే లాభాలలో 20 శాతం వాటా తీసుకోనున్నట్లు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ సందడి చేయనున్న సంగతి మనకు తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now