Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ రెమ్యూనరేషన్‌ రూ.50 కోట్లు.. తప్పుగా చెబితే చెంప దెబ్బ కొట్టండి: పోసాని

September 28, 2021 3:23 PM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా  పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పోసాని స్పందించారు. పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు కేవలం రూ.10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పడంపై పోసాని ఖండించారు.

Pawan Kalyan : పవన్‌ కల్యాణ్‌ రెమ్యూనరేషన్‌ రూ.50 కోట్లు.. తప్పుగా చెబితే చెంప దెబ్బ కొట్టండి: పోసాని
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని, కానీ  కేవలం రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు చెబుతున్నాడని, అదే కనుక నిజమైతే తాను రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని, తనకు నాలుగు సినిమాలకు సంతకం చేయమనండి.. అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోసాని తీవ్రంగా స్పందించారు.

పవన్ కళ్యాణ్ తన సినిమాలకు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోలేదని నిరూపిస్తే.. నన్ను చెంప దెబ్బ కొట్టండి అంటూ పోసాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏకంగా వేయి రూపాయల వరకు టికెట్లు పెట్టి మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now