తెలంగాణలో డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

September 24, 2021 10:34 PM

తెలంగాణ గ్రామాలలోని పేదలకు మరిన్ని వైద్య సేవలను అందించడం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గ్రామాల్లో ఉన్న ఆస్పత్రులలో పని చేయడం కోసం వైద్యుల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ సర్కారు ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే 1,677 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో డాక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తూ అక్టోబర్ నెల చివరినాటికి వైద్యుల నియామకాలు పూర్తి కావాలని ఆదేశించింది. ఈ ఉద్యోగాల నియామకాలకు జిల్లా సెలక్షన్‌ కమిటీ నేతృత్వంలో నియామక ప్రక్రియ జరుగనుంది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
ఇందులో డీఎంహెచ్‌ఎం, సోషల్‌ వెల్ఫేర్ డీడీ, టీవీవీపీ అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఈ వైద్య ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదలయ్యి అక్టోబర్ 12వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 26న మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. 27వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment