ఇదే మంచి స‌మ‌యం.. వినాయ‌కున్ని ఈ విధంగా పూజించండి.. శ‌ని దోషం పోతుంది..!

September 17, 2021 10:34 PM

జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రి జీవితం వారి గ్ర‌హాల గ‌మ‌నంపై ఆధార ప‌డుతుంది. గ్ర‌హాలు అనుకూలించ‌డం, ప్ర‌తికూలించ‌డం అంటుంటారు. అంటే న‌వ‌గ్ర‌హాల్లో కొన్ని గ్ర‌హాలు మంచి చేస్తే.. కొన్ని చెడు చేస్తాయ‌న్న‌మాట‌. అందుక‌ని గ్ర‌హాలు అనుకూలించ‌డం లేదు.. అంటుంటారు. ఈ విధంగా శ‌ని గ్ర‌హం కూడా చాలా మందికి ఇబ్బందుల‌ను క‌లిగిస్తుంటుంది.

ఇదే మంచి స‌మ‌యం.. వినాయ‌కున్ని ఈ విధంగా పూజించండి.. శ‌ని దోషం పోతుంది..!

చాలా మంది జాత‌కంలో శ‌ని దోషం ఉంటుంది. దీంతో ఏ ప‌ని చేసినా క‌ల‌సి రావ‌డం లేద‌ని, అంతా న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని కొంద‌రు ఎప్పుడూ విచారిస్తుంటారు. అయితే అలాంటి వారు వినాయ‌క న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా గ‌ణేషున్ని గ‌రిక‌తో పూజించాలి. గ‌రిక అంటే ఆయ‌న‌కు మ‌హా ప్రీతి. అందువ‌ల్ల ఈ స‌మ‌యంలో ఆయ‌న‌ను గ‌రిక‌తో పూజిస్తే శ‌ని దోషం పోతుంది. స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

వినాయ‌కుడికి గ‌రిక అంటే చాలా ఇష్టం క‌నుక వినాయ‌క చ‌వితి రోజు ప‌త్రిలో గ‌రిక‌ను ఉంచి గ‌ణేషున్ని పూజిస్తారు. అయితే మిగిలిన స‌మ‌యాల్లోనూ వినాయ‌కున్ని గ‌రిక‌తో పూజించ‌వ‌చ్చు. ముఖ్యంగా ఇది న‌వ‌రాత్రుల స‌మ‌యం క‌నుక ఆయ‌న‌ను గ‌రిక‌తో పూజిస్తే శ‌ని దోషం పోతుంది. శ‌ని ద‌గ్గ‌ర‌కు కూడా రాడ‌ని, అంతా శుభ‌మే క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక శ‌ని దోషం పోవాలంటే వినాయ‌కుడికి గ‌రిక‌తో పూజ చేయండి. ఆల‌యానికి వెళ్లేట‌ప్పుడు గ‌రిక‌ను తీసుకుని వెళ్లి వినాయ‌కుడికి స‌మ‌ర్పించండి. దీంతో శ‌ని దోషం పోయి అంతా శుభ‌మే క‌లుగుతుంది. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment