బీరువాలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే అంతా నష్టమే కలుగుతుంది..

January 22, 2022 9:18 PM

సాధారణంగా మనం బీరువా అంటే ఎన్నో రకాల వస్తువులను అందులో సర్దుతూ ఉంటాము. ఈ క్రమంలోనే బంగారం, డబ్బులు, పట్టు వస్త్రాలు, ఏవైనా ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా బీరువాలో భద్రంగా దాచి పెడతాము. బీరువాను సాక్షాత్తు లక్ష్మీ దేవిగా భావించి పూజిస్తాము కనుక బీరువాను ఎంతో పవిత్రంగా చూసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎంతో పవిత్రమైన బీరువాలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక బీరువాలో ఏ వస్తువులను పడితే ఆ వస్తువులను పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. మరి బీరువాలో ఏ విధమైనటువంటి వస్తువులను పెట్టకూడదో ఇక్కడ తెలుసుకుందామా..!

బీరువాలో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి..!

బీరువా లక్ష్మీదేవితో సమానం కనుక బీరువాలో ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ వస్తువులు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పెట్టకూడదు. ఇలాంటి వస్తువులను పెట్టడం వల్ల మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. ఈ విధమైనటువంటి వాటిని భద్రపరుచుకోవాలంటే బట్టలు పెట్టుకునే అల్మారాలో పెట్టుకోవాలి కానీ బీరువాలో అసలు పెట్టుకోకూడదు. అదేవిధంగా చాలామంది బీరువాపై అనేక బరువులు పెడుతుంటారు. అలా బీరువాపై బరువులు, పాతదుస్తులను పెట్టడం వల్ల లక్ష్మీదేవిపై అవి పెట్టినట్లు అవుతుంది. కనుక బీరువా పైభాగంలో ఏ విధమైనటువంటి వస్తువులను పెట్టకూడదు.

అలాగే లక్ష్మీదేవి కొలువై ఉండే బీరువాను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. బీరువా డోర్ పైభాగంలో ఓం అని లేదా స్వస్తిక్ గుర్తులు వేయడం ఎంతో శుభసూచకం. ముఖ్యంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని బీరువాలో ఉంచడం వల్ల అంతా శుభం జరుగుతుంది. అలాగే బీరువా లోపలి భాగంలో సుగంధ పరిమళాలను వెదజల్లే వస్తువులను ఉంచడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుతుంది. ఎంతో పవిత్రమైన ఈ బీరువాలో ఇనుప వస్తువులను ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment