సింహం వేట మామూలుగా లేదుగా.. క్షణాల్లో చిరుతను మట్టుబెట్టిన సింహం.. వీడియో వైరల్..

September 12, 2021 11:39 PM

అడవికి రాజు సింహం అనే విషయం మనందరికీ తెలిసిందే. సింహం వేట మొదలు పెట్టిందంటే అటువైపు జంతువులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. సింహం ఆమడదూరంలో వస్తుందన్న విషయం గ్రహించిన ఇతర జంతువులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగులు పెడతాయి. అయితే సోషల్ మీడియా వేదికగా ఎన్నో సింహం వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి వీడియో ప్రస్తుతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సింహం వేట మామూలుగా లేదుగా.. క్షణాల్లో చిరుతను మట్టుబెట్టిన సింహం.. వీడియో వైరల్..

‘Big Cat Namibia’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ చిరుత ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకుని అక్కడ సేదతీరుతూ కనిపించింది. అయితే అక్కడ చిరుత ఉన్న విషయాన్ని గమనించిన సింహం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒక్కసారిగా పరుగులు పెట్టి చిరుతపై దాడి చేస్తూ ఒక్కసారిగా తన పదునైన దంతాలతో చిరుత మెడను గట్టిగా పట్టేసింది.

https://www.instagram.com/p/CTmWPA9iArB/?utm_source=ig_web_copy_link

సింహం దాడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం అవకాశం లేకపోవడంతో చిరుత తన ప్రాణాలపై ఆశలు వదులుకుంది. ఈ క్రమంలోనే వెనక నుంచి మరొక సింహం వచ్చి చిరుతపై దాడి చేయడంతో చిరుత సింహానికి బలైపోయింది. ప్రస్తుతం ఈ సింహం వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment