వినాయక చవితి రోజు ఈ విధంగా చేస్తే అన్ని సమస్యలు పోతాయి.. సకల సంపదలు సిద్ధిస్తాయి..!

September 9, 2021 5:45 PM

వినాయక చవితి రోజు సహజంగానే భక్తులు ఇళ్లలో వినాయకుడి ప్రతిమలను పెట్టి పూజిస్తుంటారు. అయితే కింద చెప్పిన విధంగా వినాయకున్ని పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు పోతాయి. సకల సంపదలు కలుగుతాయి. మరి అందుకు ఏం చేయాలంటే..

వినాయక చవితి రోజు ఈ విధంగా చేస్తే అన్ని సమస్యలు పోతాయి.. సకల సంపదలు సిద్ధిస్తాయి..!

విద్య, వివాహం, గృహ నిర్మాణం, అప్పుల బాధ, అనారోగ్య సమస్యలు, ఇతరత్రా గ్రహ దోషాలు ఉన్నవారు వినాయక చవితి రోజు ఆయనకు ముడుపు కట్టండి. సంకల్పం చేసుకోండి. మీ ఈతి బాధలను విఘ్నేశ్వరుడు తొలగిస్తాడు.

వినాయక చవితి రోజు ఒక తెల్లని వస్త్రంలో కిలోంపావు బియ్యం, బెల్లం ముక్క, పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరి కుడుక, 11 రూపాయలు పెట్టి మూట కట్టాలి. గణపతి పూజ చేసి సంకల్పం చేయాలి. మీ గోత్ర నామాదులు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని, మీ బాధలు, కష్టాలు చెప్పుకుని తీర్చమని వేడుకుని వినాయకుని నామాలను 108 సార్లు జపించి కొబ్బరికాయ కొట్టాలి. తరువాత 41 రోజుల్లో మీరు కోరుకున్నవి నెరవేరుతాయి.

మీరు కోరినవి నెరవేరిన తరువాత ఆ ముడుపును మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఇచ్చి ఉండ్రాళ్లతో అర్చన చేసి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇలా మొక్కు తీర్చుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now