పవన్ కల్యాణ్‌ ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం ఎవరో తెలుసా ?

September 2, 2021 10:17 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కెరియర్ మొదట్లో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పుట్టిన రోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తమ అభిమాన నటుడికి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పవన్ కల్యాణ్‌ ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం ఎవరో తెలుసా ?

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో నుంచి వరుస అప్‌డేట్‌లను విడుదల చేస్తూ చిత్ర బృందం అభిమానులకు ఫుల్ ట్రీట్‌ ఇస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌ నటిస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండటానికి ఓ వ్యక్తి కారణమని పవన్ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.

ఉన్నత చదువులు చదవడానికి ఏమాత్రం ఇష్టపడని పవన్ కల్యాణ్‌ ఒంటరిగా కూర్చొని ఏవో పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఈ క్రమంలోనే తన వదిన, మెగాస్టార్ భార్య సురేఖ చిరంజీవితో మాట్లాడి పవన్ కల్యాణ్‌ ను ఎలాగైనా సినిమాలలోకి తీసుకు వెళ్లాలని సూచించారట. సినిమాలంటే ఇష్టం లేని పవన్ కల్యాణ్‌ ను సురేఖ బలవంతంగా ప్రోత్సహించడం వల్లే నేడు పవన్ కల్యాణ్‌ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారని ఈ విషయాన్ని పవన్ కల్యాణ్‌ ఎన్నో సందర్భాలలో కూడా తెలియజేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ స్టార్‌డమ్‌ సంపాదించడం వెనక తన వదిన సురేఖ ప్రోత్సాహం చాలా ఉందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment