మీరు వాడుతున్న ఉప్పు అసలుదేనా ? క‌ల్తీ జ‌రిగిందా ? ఇలా సుల‌భంగా ప‌రీక్ష చేసి తెలుసుకోండి..!

August 29, 2021 7:03 PM

ప్ర‌స్తుతం మ‌నం వాడుతున్న అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలు క‌ల్తీ అవుతున్నాయి. క‌ల్తీకి కాదేదీ అన‌ర్హం.. అన్న‌ట్లు అన్ని ప‌దార్థాల‌ను క‌ల్తీ చేస్తున్నారు. అయితే క‌ల్తీ ప‌దార్ధాల వ‌ల్ల వ్యాపారుల‌కు పెద్ద మొత్తంలో లాభం క‌లుగుతుంది, కానీ మ‌న‌కు మాత్రం న‌ష్టం క‌లుగుతుంది. అలాంటి ప‌దార్థాల‌ను తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

మీరు వాడుతున్న ఉప్పు అసలుదేనా ? క‌ల్తీ జ‌రిగిందా ? ఇలా సుల‌భంగా ప‌రీక్ష చేసి తెలుసుకోండి..!

మ‌నం నిత్యం వాడే ప‌దార్థాల్లో ఉప్పు ఒక‌టి. మార్కెట్‌లో క‌ల్తీ అయిన ఉప్పును కూడా విక్ర‌యిస్తున్నారు. మ‌నం తినే ఉప్పులో క‌చ్చితంగా అయోడిన్ ఉండాలి. అయోడిన్ ఉప్పును వాడ‌డం వ‌ల్ల శ‌రీర పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. మెద‌డు అభివృద్ధి చెందుతుంది. కానీ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుక‌నే కేంద్ర ప్ర‌భుత్వం మ‌నం తినే ఉప్పులో నిర్దిష్ట మోతాదులో అయోడిన్ ఉండాల‌ని ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేసింది. ఎప్ప‌టి నుంచో ఈ విధానాన్ని పాటిస్తున్నారు.

ఇక నేష‌న‌ల్ అయోడిన్ డెఫిషియ‌న్సీ డిజార్డ‌ర్స్ చెబుతున్న ప్ర‌కారం మ‌నం వాడే ఉప్పులో అయోడిన్ శాతం 15 పీపీఎంకు మించి ఉండాలి. కొన్ని ర‌కాల కంపెనీల్లో అయోడిన్ 30 పీపీఎం వ‌ర‌కు ఉంటుంది. దాన్ని డ‌బుల్ ఫోర్టిఫైడ్ ఉప్పు అంటారు. కానీ కొన్ని కంపెనీలు మాత్రం అయోడిన్ ఉప్పును విక్ర‌యించ‌డం లేదు. క‌ల్తీ అయిన ఉప్పును విక్ర‌యిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి ఉప్పును తింటున్న చాలా మంది అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నారు.

ఇక క‌ల్తీ అయిన ఉప్పును, అస‌లు ఉప్పును తెలుసుకోవ‌డం చాలా సుల‌భ‌మే. అందుకు గాను ఆలుగడ్డ‌ల‌తో కింద తెలిపిన టెస్ట్ చేయాలి.

ముందుగా ఒక ఆలుగ‌డ్డ‌ను తీసుకోవాలి. దాన్ని అడ్డంగా రెండు ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఒక్కో ముక్క‌పై ఉప్పు రాయాలి. ఒక నిమిషం పాటు ఉండాలి. త‌రువాత ఒక్కో ముక్క‌పై కొన్ని చుక్క‌ల నిమ్మ‌ర‌సం పిండాలి. అనంత‌రం వేచి చూస్తే ఆలుగ‌డ్డ ముక్క పై భాగం రంగు మారుతుంది. అదే జ‌రిగితే ఆ ఉప్పు క‌ల్తీ అయింద‌ని తెలుసుకోవాలి. క‌ల్తీ అయిన ఉప్పు అయితే ఆలుగ‌డ్డ ముక్క పై భాగం నీలి రంగులోకి మారుతుంది. అదే అయోడిన్ ఉన్న అస‌లైన ఉప్పు అయితే ఆలుగ‌డ్డ ముక్క రంగు మార‌దు. ఈ విధంగా క‌ల్తీ అయిన ఉప్పును, అస‌లు ఉప్పును సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పైన తెలిపిన టెస్ట్‌కు చెందిన వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. దాన్ని చూస్తే విష‌యం మ‌రింత‌గా అర్థం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment