“మా” అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల తేదీ ఖరారు.. ఎన్నికలు ఎప్పుడు అంటే ?

August 26, 2021 2:30 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి ఎన్నికల విష‌యం హాట్ టాపిక్ గా మారింది. మా అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే నువ్వా నేనా అంటూ పోటీపడుతూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అధ్యక్ష పదవి కోసం చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ పదవి కోసం మాటల తూటాలను పేలుస్తూ విమ‌ర్శ‌ల జ‌ల్లు కురిపించుకుంటున్నారు.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా అధ్యక్ష పదవి కోసం ఏకంగా ఐదు మంది పోటీ చేయడం గమనార్హం. ఈ ఐదుగురు అభ్యర్థులు నువ్వానేనా అంటూ పోటీలలో దిగనున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ మెంబర్స్ ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరగాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా నటి హేమ ప్రస్తుత మా అధ్యక్షుడిపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్న మా అసోసియేషన్ త్వరలోనే ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. మా అధ్యక్ష పదవికి అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయని భావించిన సభ్యులు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మా అధ్యక్షుడు నరేష్ అధికారికంగా వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment