శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్‌.. రూ.11వేలే..!

August 19, 2021 2:12 PM

శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎ03ఎస్ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్ ల‌భిస్తోంది. 4జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్‌.. రూ.11వేలే..!

ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్‌, ఇంకో 2 మెగాపిక్స‌ల్ మాక్రో కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది.

5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఈఫోన్ లో ల‌భిస్తుంది. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్స్ లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క వైపున ఉంటుంది. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి.

ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.11,499 ఉండ‌గా, 4జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.12,499గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని రిటెయిల్ స్టోర్లు, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌, ఆన్‌లైన్ స్టోర్‌ల‌లో విక్ర‌యిస్తున్నారు. ఫైనాన్స్ స‌దుపాయంతో కొంటే రూ.1000 క్యాష్ బ్యాక్ ఇస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment