మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.2 నాణెం ఉందా ? ఆన్‌లైన్‌లో అమ్మి రూ.5 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు..!

August 17, 2021 9:41 PM

పాత నాణేల‌ను సేక‌రించే అల‌వాటు మీకు ఉందా ? అయితే ఈ హాబీతో మీకు ఆన్‌లైన్‌లో రూ.ల‌క్ష‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుత త‌రుణంలో పాత నాణేల‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఆ నాణేలు లేదా నోట్ల‌ను విక్ర‌యించి డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. ఇక ఓ ప్ర‌త్యేక‌మైన రూ.2 నాణెంతో రూ.ల‌క్ష‌లు సంపాదించే వీలు ఉంది.

మీ ద‌గ్గ‌ర ఈ పాత రూ.2 నాణెం ఉందా ? ఆన్‌లైన్‌లో అమ్మి రూ.5 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు..!

1994లో ముద్రించ‌బ‌డిన రూ.2 నాణెంపై వెనుక భాగంలో జాతీయ ప‌తాకం ఉంటుంది. ఈ నాణేనికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. Quickr అనే వెబ్‌సైట్‌లో దీన్ని విక్ర‌యించ‌వ‌చ్చు. ఈ నాణెం మీ వ‌ద్ద ఉంటే ఆ సైట్‌లో ముందుగా రిజిస్ట‌ర్ చేసుకుని లాగిన్ అయి నాణెం ఉన్న ఫొటోల‌ను యాడ్ రూపంలో పెట్ట‌వ‌చ్చు. దీంతో ఆస‌క్తి ఉన్న‌వారు మిమ్మ‌ల్ని సంప్ర‌దించి కాయిన్‌ను కొనుగోలు చేస్తారు. ఇలా రూ.5 ల‌క్ష‌లు వ‌స్తాయి.

ఇక దేశానికి స్వాతంత్య్రం రాక ముందు ముద్రించ బ‌డిన ఓ రూ.1 వెండి నాణెం ఏకంగా రూ.2 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది. అలాగే 1918 సంవ‌త్సరానికి చెందిన మ‌రో కాయిన్‌ను రూ.9 ల‌క్ష‌ల‌కు కొన్నారు. అందువల్ల పాత నాణేలు ఉంటే వాటిని విక్ర‌యించి డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. ఆన్ లైన్ క్లాసిఫైడ్ సైట్స్‌తోపాటు CoinBazzar అనే సైట్‌లోనూ పాత నాణేల‌ను, క‌రెన్సీ నోట్ల‌ను కొంటున్నారు. మీ ద‌గ్గ‌ర ఏమైనా ఉంటే ఆ సైట్ల‌లో వాటిని అమ్మ‌వ‌చ్చు. డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment