అత్తవారింటికి కొత్తల్లుడు తీసుకొచ్చిన సారె.. 10వేల కిలోల స్వీట్లు, 100 అరటి గెలలు, వందలాది చీరలు..!

August 12, 2021 10:10 PM

అత్త వారింటికి వెళ్లిన ఓ నవ వధువుతో ఆమె తండ్రి అప్పట్లో భారీ మొత్తంలో సారెను పంపిన వార్త గుర్తుందా ? భారీ ఎత్తున స్వీట్లు, పచ్చళ్లు, కూరగాయలు, మాంసం వంటి పదార్థాలను, వస్తువులను పంపించాడు. దీంతో ఆ వార్త వైరల్‌ అయింది. అయితే వియ్యంకుల వారు చేసిన మర్యాదకు ఉబ్బి తబ్బిబ్బైన పెళ్లి కొడుకు తరఫు తల్లిదండ్రులు ఇప్పుడు తమ సత్తా ఏంటో చూపించారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

అత్తవారింటికి కొత్తల్లుడు తీసుకొచ్చిన సారె.. 10వేల కిలోల స్వీట్లు, 100 అరటి గెలలు, వందలాది చీరలు..!

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మిల పెద్ద కుమార్తె ప్రత్యూష దేవికి, యానాంకు చెందిన తోట రాజు, నాగలక్ష్మిల కుమారుడు పవన్‌కుమార్‌కు గత మే నెలలో వివాహం అయింది.

అయితే ఆషాఢం సందర్భంగా యానాంకు వచ్చిన వధువు భారీ ఎత్తున సారె తెచ్చింది. ఈ వార్త అప్పట్లో వైరల్‌ అయింది. ఇక పెళ్లి కొడుకు శ్రావణంలో అత్త వారింటికి వస్తూ అప్పుడు తమకు వారు ఎలా సారె పంపించారో ఇప్పుడు కూడా అదే రీతిలో అతను భారీ ఎత్తున సారెను తన అత్తింటి వారికి తీసుకెళ్లాడు. ఆ సారెలో 10వేల కిలోల స్వీట్లు, 100 అరటి గెలలు, రెండు వ్యాన్లలో పూలు, పండ్లు, వందలాది చీరలు, రవికలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత ఈ వార్త కూడా వైరల్‌ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment