సోద‌రి క్యాన్సర్ చికిత్స కోసం రోడ్డు ప‌క్క‌న ప‌క్షి ఆహారం అమ్ముతున్న బాలుడు.. స‌హాయం చేసే వారి కోసం ఎదురు చూపు..

August 7, 2021 5:32 PM

క‌న్న‌వారికి, కుటుంబ స‌భ్య‌ల‌కు ఏమైనా అయితే వారిని ర‌క్షించుకునేందుకు తోటి కుటుంబ స‌భ్యులు ఏం చేసేందుకైనా వెనుకాడ‌రు. ఆ బాలుడు కూడా అలాగే త‌న తోబుట్టువును ర‌క్షించుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ఓ వైపు రోడ్డు ప‌క్క‌న ప‌క్షి ఆహారం అమ్ముతూనే మ‌రో వైప త‌న చ‌దువును కొన‌సాగిస్తున్నాడు.

this boy selling bird food to save his sister

హైద‌రాబాద్‌కు చెందిన 10 ఏళ్ల స‌య్య‌ద్ అజీజ్ అనే బాలుడి సోద‌రి స‌కీనా బేగం (12) క్యాన్స‌ర్ బారిన ప‌డింది. 2 ఏళ్ల కింద‌ట ఆమెకు బ్రెయిన్ క్యాన్స‌ర్ వ‌చ్చింది. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం స‌హాయం చేసింది. కానీ ఆమెకు ఆ డ‌బ్బులు చికిత్స కోసం ఖ‌ర్చ‌య్యాయి. దీంతో వారి ప‌రిస్థితి మొద‌టికి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో వారు స‌హాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక త‌న సోద‌రిని ఎలాగైనా ర‌క్షించుకోవాల‌నే తాప‌త్ర‌యంతో అజీజ్ రోజూ ఉద‌యం 6 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు ర‌హ‌దారి ప‌క్క‌న ప‌క్షి ఆహారం (బ‌ర్డ్ ఫుడ్‌) అమ్ముతున్నాడు. త‌రువాత అత‌ను 8 గంట‌ల‌కు మ‌ద‌ర్సాకు వెళ్తాడు. అజీజ్ సంపాదించే డ‌బ్బులు ఆమె మందుల‌కు మాత్ర‌మే స‌రిపోతున్నాయి. టెస్టులు చేయించేందుకు డ‌బ్బులు స‌రిపోవ‌డం లేదు. దీంతో అజీజ్ త‌ల్లిదండ్రులు త‌మ‌కు స‌హాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment