3 కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన రియల్‌మి.. ధ‌ర రూ.6,999తో ప్రారంభం..!

April 8, 2021 4:18 PM

మొబైల్స్ త‌యారీదారు రియ‌ల్‌మి గురువారం సి20, సి21, సి25 పేరిట మూడు కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిల్లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను కామ‌న్‌గా అందిస్తున్నారు. సి20, సి21 ఫోన్ల‌లో మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్ ఉండ‌గా, ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ల‌భిస్తుంది. అలాగే సి25 ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది.

Realme C20, C21, C25 smart phones launched in india

రియ‌ల్‌మి సి20, సి21 ఫీచ‌ర్లు

  • 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి35 ప్రాసెస‌ర్
  • సి20 – 2జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  • సి21 – 2/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  • డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 10 ఓఎస్
  • సి20 – 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
  • సి21 – 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ (సి21లో మాత్ర‌మే)
  • డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0
  • 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి సి25 ఫీచర్లు

  • 6.5 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్
  • 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 13, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
  • డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
  • బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 6000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రియ‌ల్‌మి సి20 స్మార్ట్ ఫోన్ కూల్ బ్లూ, కూల్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.6,999గా ఉంది. అయితే మొద‌టి 10 ల‌క్ష‌ల మందికి ఈ ఫోన్‌ను రూ.6799కే అందివ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌ను ఏప్రిల్ 13వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

రియ‌ల్‌మి సి21 స్మార్ట్ ఫోన్ క్రాస్ బ్లూ, క్రాస్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్ మోడ‌ల్ ధర రూ.7,999 ఉండ‌గా, 4జీబీ ర్యామ్ మోడ‌ల్ ధ‌ర రూ.8,999 గా ఉంది. దీన్ని ఏప్రిల్ 14 నుంచి విక్ర‌యిస్తారు.

రియ‌ల్‌మి సి25 స్మార్ట్ ఫోన్ వాట‌రీ గ్రే, వాట‌రీ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 64జీబీ మోడ‌ల్ ధ‌ర రూ.9,999గా ఉంది. 128జీబీ మోడ‌ల్ ధ‌ర‌ను రూ.10,999గా నిర్ణ‌యించారు. దీన్ని ఏప్రిల్ 16 నుంచి విక్ర‌యిస్తారు. అన్ని ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌తోపాటు రియ‌ల్‌మి ఆన్‌లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ స్టోర్ల‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ల‌భిస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment