వకీల్ సాబ్” హీరోయిన్ కి కరోనా.. ఆందోళనలో చిత్రబృందం..!

April 8, 2021 9:10 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ హీరోయిన్ నివేద థామస్ కరోనా మహమ్మారి బారిన పడినట్లుగా తెలియజేసింది. వకీల్ సాబ్ ప్రమోషన్ లో పాల్గొన్న నేపథ్యంలోనే ఈమెకు కరోనా నిర్ధారణ అయినట్లు తెలియజేశారు.

నివేద థామస్ కరోనా నిర్ధారణ జరిగి నాలుగు రోజులు కాకుండానే ,మరొక హీరోయిన్ కూడా కరోనా బారిన పడినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ అంజలికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఈమె హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వకీల్ సాబ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న ఈ ఇద్దరు హీరోయిన్స్ కరోనా బారిన పడటంతో చిత్ర బృందం కొంతమేరకు ఆందోళన చెందుతోంది.

ప్రస్తుతం హీరోయిన్ అంజలి పరిస్థితి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజుల నుంచి తనని కలిసిన వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అంజలి కోరింది. వకీల్ సాబ్ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment