ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో అనేక ఊహాగానాలు వ‌స్తున్నాయి.

April 6, 2026 8:09 PM
Trisha Krishnan and Vijay's joint appearance fueling affair rumors.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ – త్రిషల డేటింగ్ వార్తలపై నెటిజన్ల మధ్య హాట్ హాట్ చర్చ. Photo Credit: Trisha/Instagram.

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో అనేక ఊహాగానాలు వ‌స్తున్నాయి. విజ‌య్‌కు చెందిన టీవీకే పార్టీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయ‌బోతున్నార‌ని, ఆమెను విజ‌య్ సీఎంను చేస్తాడ‌ని, ఆమెను పెళ్లి చేసుకుంటాడ‌ని.. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు త‌ర‌చూ వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. అయితే త్రిష మాత్రం త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌కు నేరుగా స్పందించ‌డం లేదు. బ‌దులుగా త‌న ఇన్‌స్టా ఖాతాలో కొటేష‌న్‌ల‌తో కూడిన పోస్టుల‌ను పెడుతోంది. ఇప్పుడు కూడా ఆమె ఓ మ‌హిళ మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. అందులో క్లుప్తంగా చెప్పాలంటే తాను ఏ వార్త‌ల‌ను ప‌ట్టించుకోన‌ని, వీలైనంత వ‌ర‌కు ప్ర‌శాంతంగా జీవితం గ‌డిపేందుకు య‌త్నిస్తున్నాన‌ని ఆమె ఆ వీడియోను షేర్ చేయ‌డం ద్వారా ప‌రోక్షంగా త‌న మ‌న‌సులో ఉన్న భావాల‌ను వెల్ల‌డించింది.

కొటేష‌న్లు చెప్పిన మ‌హిళ వీడియో షేరింగ్‌..

న‌టుడు విజ‌య్ భార్య సంగీత ఆయ‌న‌తో విడాకులు ఇప్పించాల‌ని కోరుతూ కోర్టులో పిటిష‌న్ వేసినప్ప‌టి నుంచి విజ‌య్‌, త్రిష వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఈ ఇద్ద‌రి పై ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య సంబంధం ఉంద‌నే విష‌యాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేదు. కానీ ఏకంగా ఈ ఇద్ద‌రూ ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌ర‌వ‌డంతో అంద‌రి అనుమానాలు తీరిపోయాయి. వారు త‌మ బంధాన్ని ప‌రోక్షంగానే అలా ప‌బ్లిక్ ప్లేసులో వెల్ల‌డించారు. అయితే అప్ప‌టి నుంచి త్రిష నేరుగా స్పందించ‌క‌పోయినా కొటేష‌న్ల‌తో కూడిన పోస్టుల‌ను షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె చేసిన పోస్టులోని వీడియోలో ఉన్న మ‌హిళ వ్య‌క్తిత్వానికి సంబంధించి ప‌లు మాట‌లు మాట్లాడింది.

త్రిష మ‌న‌సులో ఇదే ఉందా..?

త‌న జీవితంలో ఇప్పుడు తాను వాద‌న‌లు చేయ‌లేని ద‌శ‌లో ఉన్నాన‌ని, ఎవ‌రైనా ఏనుగు ఎగురుతుంద‌ని చెప్పినా తాను అది స‌రైందేన‌ని చెప్తాన‌ని ఆ వీడియోలోని మ‌హిళ తెలిపింది. తాను ఎదుటివారికి న‌చ్చేలా వారిని ఒప్పించాల్సిన ప‌ని లేద‌ని, ఒక ముఖ్య‌మైన విష‌యం నేర్చుకున్నాన‌ని, స‌రైందిగా ఉండ‌డం క‌న్నా ప్ర‌శాంత‌త‌తో జీవించ‌డం ముఖ్య‌మ‌ని తెలిపింది. వివ‌ర‌ణ ఇవ్వ‌డం క‌న్నా నిశ్శ‌బ్దం చాలా చ‌వ‌కైన‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ శ‌క్తి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని, కొన్నిసార్లు వాద‌న‌లు చేసినంత మాత్రం అవి అపార్థాలు కావ‌ని పేర్కొంది. ఆ వాద‌న‌లు శ‌క్తిని ఖాళీ చేస్తాయ‌ని, అందుక‌నే వాటిని తాను తిర‌స్క‌రిస్తాన‌ని, న‌వ్వుతాన‌ని, ప్ర‌శాంతంగా ఉండేందుకు య‌త్నిస్తాను అని ఆ వీడియోలో మ‌హిళ తెలిపింది. అయితే త్రిష ఆ వీడియోను షేర్ చేసింది క‌నుక ఆమె మ‌న‌సులో కూడా స‌రిగ్గా ఇలాంటి భావాలే ఉన్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ప్రేమ‌ లేక‌పోతే అంతా అర్థ ర‌హిత‌మే..

ఇక ఆ వీడియోతోపాటు త్రిష మ‌రో పోస్టును కూడా షేర్ చేసింది. అందులో ప్రేమ అన్న‌ది అంతా కాద‌ని, కానీ ప్రేమ లేక‌పోతే అంతా అర్థ ర‌హిత‌మే అనే సందేశం ఉంది. ఈ కోట్‌కు త్రిష ఫ్యాక్ట్ అనే ఒక ప‌దాన్ని క్యాప్ష‌న్‌గా ఇచ్చారు. త్రిష‌, విజ‌య్‌లు కోలీవుడ్‌లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ఆన్‌-స్క్రీన్ జంట‌గా పేరుగాంచారు. వారి మొద‌టి చిత్రం గిల్లి క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ హిట్ అయింది. త‌రువాత తిరుపాచి, ఆతి, కురువి వంటి చిత్రాల్లో వీరు క‌ల‌సి న‌టించారు. బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యాల‌ను న‌మోదు చేఠ‌శారు. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ త‌రువాత మ‌ళ్లీ ఇటీవ‌లే వారు లియో అనే చిత్రంలో క‌ల‌సి న‌టించారు. దీనికి లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవ‌లి కాలంలో విజ‌య్‌, త్రిష పేర్లు సోష‌ల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. అయితే ఈ ప్ర‌చారాల‌పై త్రిష నేరుగా స్పందించ‌కుండా కోట్‌ల‌ను షేర్ చేస్తోంది. కానీ విజ‌య్ కూడా ఈ వ్య‌వ‌హారంపై ఎక్క‌డా స్పందించ‌లేదు. కేవ‌లం త‌న విడాకుల గురించే మాట్లాడుతూ వ‌స్తున్నారు. మ‌రి వీరి వ్య‌వ‌హారం చివ‌ర‌కు ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment