‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఆమె తెలుగులో మ‌ళ్లీ సినిమాలు చేస్తుందా, లేదా అన్న‌ది తెలియ‌దు కానీ, ప్ర‌స్తుతం ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాలతో ఆమె బిజీగా ఉంది.

April 3, 2026 6:02 PM
Malavika Mohanan sharing her March memories on social media.
సోషల్ మీడియా వేదికగా తన మార్చి నెల జ్ఞాపకాలను పంచుకున్న నటి మాళవిక మోహనన్. Photo Credit: Malavika Mohanan/Instagram.

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయితే ఆమె తెలుగులో మ‌ళ్లీ సినిమాలు చేస్తుందా, లేదా అన్న‌ది తెలియ‌దు కానీ, ప్ర‌స్తుతం ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాలతో ఆమె బిజీగా ఉంది. దర్శకుడు త్యాగ‌రాజ‌న్ కుమార‌రాజా రూపొందిస్తున్న మూడో చిత్రం పాకెట్ న‌వెల్ లో విజ‌య్ సేతుప‌తి, మాళ‌విక మోహ‌న‌న్‌, కిశోర్‌, రాజు బి.శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే మార్చి నెల ముగిసిన నేప‌థ్యంలో ఆ నెల‌లో త‌న అనుభ‌వాల‌ను మాళ‌విక మోహనన్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ మార్చి నెల త‌న‌కు మిశ్ర‌మ ఫ‌లితాల‌ను ఇచ్చింద‌ని తెలియ‌జేసింది. అయితే షూటింగ్ కోసం ఇంటికి దూరంగా ఉండ‌డం మాత్రం త‌న‌ను కుంగ‌దీసింద‌ని తెలియ‌జేసింది.

మిక్స్‌డ్ బ్యాగ్‌గా మార్చి..

మార్చి నెల తనకు మిక్స్‌డ్ బ్యాగ్ గా అనిపించిందని ఆమె పేర్కొంది. అయితే దర్శకుడు త్యాగ‌రాజన్ కుమారరాజాతో కలిసి పాకెట్ నవెల్ చిత్రంలో పని చేయడం తనకు ఆ నెలలో అత్యంత ముఖ్యమైన అనుభవమని తెలిపింది. మన తరం అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన ఆయనతో పని చేయడం, ఆయన పని విధానాన్ని దగ్గరగా గమనించడం, ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం త‌న‌ కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన క్రియేటివ్ అనుభవాల్లో ఒకట‌ని మాళ‌విక పేర్కొంది. ఆరణ్య కాండం, సూపర్ డీలక్స్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ దర్శకుడితో తన అనుభవాలను త్వరలో మరింత వివరంగా పంచుకుంటానని కూడా చెప్పింది.

ఒంట‌రిత‌నాన్ని ఎదుర్కొన్నా..

అయితే ఈ చిత్ర షూటింగ్ కారణంగా తాను ఎక్కువకాలం చెన్నైలో ఉండాల్సి రావడంతో ఒంటరితనాన్ని ఎదుర్కొన్నానని మాళ‌విక వెల్లడించింది. ఈ నెల ఎక్కువ భాగం చెన్నైలో షూటింగ్‌లో గడిచింద‌ని, పని అద్భుతంగా ఉన్నప్పటికీ ఇంటి నుంచి దూరంగా ఉండటం ఊహించిన దానికంటే ఎక్కువగా త‌న‌ను ప్రభావితం చేసింద‌ని తెలిపింది. రోజు మొత్తం పని ముగిసిన తర్వాత ఖాళీ గదికి తిరిగి రావడం అంత సులభం కాద‌ని ఆమె చెప్పింది. ఈ పరిస్థితుల్లో తన కుటుంబం చెన్నైకి రావడం తనకు ఎంతో ఉపశమనం ఇచ్చిందని ఆమె తెలిపింది. కొన్ని రోజులు త‌న‌ కుటుంబం త‌న‌ను కలవడానికి రావడం త‌న‌ మనసుకు ఎంతో శాంతి ఇచ్చింద‌ని, చెన్నై, మహాబలిపురంలో ఆలయాలను సందర్శించడం, స్థానిక వంటకాలను ఆస్వాదించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయ‌ని తెలియ‌జేసింది. ముఖ్యంగా త‌న‌ అమ్మమ్మ కూడా రావడం మరింత ప్రత్యేకంగా అనిపించింద‌ని పేర్కొంది.

ఇక పాకెట్ నవెల్ చిత్రంతో దర్శకుడు త్యాగ‌రాజన్ కుమారరాజా, విజయ్ సేతుపతి మళ్లీ కలిసి పనిచేస్తుండటం విశేషం. ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment