అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్ న‌టి రాధిక అన్నారు. తాజాగా ఆట డ్యాన్స్ షోలో ఆమె జ‌డ్జిగా పాల్గొని ఆ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె కామెంట్లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

March 29, 2026 3:04 PM
Radhika Sarathkumar speaking about Allu Arjun on Zee Telugu Aata dance show.
అల్లు అర్జున్‌తో తనకున్న చిన్ననాటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నటి రాధిక. Photo Credit: Allu Arjun/Radhika Sarathkumar/Instagram/Aata Show.

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్ న‌టి రాధిక అన్నారు. తాజాగా ఆట డ్యాన్స్ షోలో ఆమె జ‌డ్జిగా పాల్గొని ఆ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆమె కామెంట్లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. అస‌లు ఆమె అల్లు అర్జున్‌కు ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా డ్యాన్స్ నేర్పించారు.. అంటూ ఫ్యాన్స్ ఆశ్చ‌ర్యంలో ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. కొంద‌రు నెటిజన్లు మాత్రం ఆమె కామెంట్ల‌ను ఫ‌న్నీగా కొట్టి పారేయ‌గా, మరికొంద‌రు మాత్రం సీరియ‌స్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. ఎప్పుడైనా ఆయ‌న చిన్న‌త‌నంలో ఆమె ఏదైనా సంద‌ర్భంలో ఒక‌టి రెండు డ్యాన్స్ స్టెప్స్‌ను నేర్పించి ఉండ‌వచ్చు, అందుక‌నే ఆమె అలా కామెంట్ చేసింద‌ని ప‌లువురు నెటిజ‌న్లు అంటున్నారు. అయితే ఆ సంద‌ర్భాన్ని కూడా రాధిక వివ‌రించారు.

షూటింగ్‌లో భాగంగా బ‌న్నీకి డ్యాన్స్ నేర్పించా: రాధిక‌

న‌టి రాధిక హీరోయిన్‌గా అప్ప‌ట్లో ప‌లు భాష‌ల‌కు చెందిన చిత్రాల్లో ఎక్కువ‌గా న‌టించారు. తెలుగు, త‌మిళ సినిమాల్లో ఆమె ఎక్కువ‌గా యాక్ట్ చేశారు. ప్ర‌స్తుతం టీవీ షోలు, సీరియ‌ల్స్‌తోపాటు ప‌లు సినిమాల్లోనూ త‌ల్లి, అక్క‌, వ‌దిన వంటి పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక తాజాగా ఆట డ్యాన్స్ షోలో జ‌డ్జిగా పాల్గొన్న ఆమె ప్రీతి అనే కంటెస్టెంట్ వేసిన పుష్ప 2లోని జాత‌ర స్టెప్పుల‌కు ఫిదా అయి ప్రీతిని అభినందించారు. అదే సంద‌ర్భంలో ఆమె అల్లు అర్జున్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌న్నీకి డ్యాన్స్ నేర్పించింది తానే అని తెలిపారు. దీంతో అక్క‌డ ఉన్న ప్రేక్ష‌కులే కాకుండా బ‌న్నీ ఫ్యాన్స్‌, సినిమా ప్రేక్ష‌కులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్రీతిని పొగిడిన అనంత‌రం రాధిక మాట్లాడుతూ అల్లు అర్జున్ అంత గొప్ప డ్యాన్స‌ర్ అవ‌డానికి తానే కార‌ణ‌మ‌ని చెప్పారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో అప్ప‌ట్లో తాను ఓ సినిమా చేశాన‌ని, అప్పుడు షూటింగ్ సంద‌ర్భంగా బ‌న్నీకి డ్యాన్స్ నేర్పించాన‌ని గుర్తు చేసుకున్నారు.

స‌ర‌దాగా రియాక్ట్ అవుతున్న నెటిజ‌న్లు..

అప్ప‌ట్లో షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఒక సీన్‌లో యాక్ట్ చేసేందుకు చిన్న పిల్లాడు అవ‌స‌రం అయ్యాడ‌ని, అయితే బ‌న్నీ అందుబాటులో ఉండ‌డంతో అత‌నితో ఓ సీన్‌లో యాక్ట్ చేశాన‌ని రాధిక చెప్పారు. ఆ సీన్‌లో అల్లు అర్జున్‌ను ఎత్తుకుని రైల్వే ట్రాక్‌పై ప‌రుగెత్తాన‌ని తెలిపారు. కాగా ఆ డ్యాన్స్ షోకు చెందిన ప్రోమోలో రాధిక చేసిన కామెంట్ల‌ను పెట్టారు. దీంతో ఆ ప్రోమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే రాధిక ఈ కామెంట్ల‌ను ఫ‌న్నీగానే చేసిన‌ట్లు ప్రోమోను చూస్తే అర్థ‌మ‌వుతోంది. నెటిజన్లు కూడా దీనిపై స‌ర‌దాగానే రియాక్ట్ అవుతున్నారు. బ‌న్నీకి మీరు డ్యాన్స్ నేర్పించారా.. అని ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న టాలీవుడ్‌లోనే వ‌న్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్స‌ర్ల‌లో ఒక‌రిగా నిలిచారు. ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్నారు. ఆయ‌న న‌టించిన పుష్ప‌, పుష్ప 2 చిత్రాలు ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించి వ‌సూళ్ల‌లో రికార్డుల‌ను సృష్టించాయి. ఇక ప్ర‌స్తుతం బ‌న్నీ అట్లీతో క‌లిసి ఓ మూవీ చేస్తుండ‌గా, అది పూర్త‌యిన వెంట‌నే లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో సినిమా చేయ‌నున్నారు. ఈ సినిమాల‌పై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment