ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ అడుగుతున్నార‌ని, కానీ తాను అందుకు సిద్ధంగా లేన‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ తెలిపారు.

March 19, 2026 10:23 PM
Anupam Kher talking about his bald look in an interview.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కంపెనీల ఆఫర్లను తిరస్కరించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. Photo Credit: Anupam Kher/Instagram.

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ అడుగుతున్నార‌ని, కానీ తాను అందుకు సిద్ధంగా లేన‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ తెలిపారు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ తాను చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మొద‌టిసారిగా వ‌చ్చిన‌ప్పుడు సంప్ర‌దాయ న‌టుడిలా క‌నిపించ‌లేద‌ని అన్నారు. బ‌ట్ట‌త‌ల‌తో ఉండ‌డం వ‌ల్ల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని అనేక హెయిర్ వీవింగ్ కంపెనీలు అడిగాయని, చాలా మంది డాక్ట‌ర్లు త‌న‌ను సంప్ర‌దించార‌ని అన్నారు. హెయిర్ వీవింగ్ కంపెనీ లేదా డాక్ట‌ర్‌కు తాను ఒక క‌ల‌ల వ్య‌క్తిన‌ని, చాలా మంది త‌న‌కు డ‌బ్బులు ఎదురు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిపారు. ఒక‌సారి అయినా త‌మ వద్ద హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని కోరార‌ని వెల్ల‌డించారు. అయితే వారికి తాను ఆ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చెబుతూ అందుకు గ‌ల కార‌ణాల‌ను అనుప‌మ్ ఖేర్ వివ‌రించారు.

అలాంటి ఆఫ‌ర్ల‌ను అంగీక‌రిస్తే వ్యక్తిగా ఓడిపోయిన‌ట్లే..

హెయిర్ వీవింగ్ కంపెనీ లేదా డాక్ట‌ర్లు ఎంత డ‌బ్బు ఇచ్చినా, త‌న‌కు డ‌బ్బు ఎంత అవ‌స‌రం ఉన్నా వారు ఇచ్చే ఆఫ‌ర్ల‌కు అంగీక‌రించ‌న‌ని అనుప‌మ్ ఖేర్ స్ప‌ష్టం చేశారు. వారి ఆఫ‌ర్ల‌ను అంగీక‌రిస్తే తాను వ్య‌క్తిత్వం కోల్పోయిన‌ట్లేన‌ని అన్నారు. త‌న కుమారుడు సికింద‌ర్ చిన్న‌త‌నంలో ఒక‌సారి వార్తాప‌త్రిక చ‌దువుతున్న‌ప్పుడు హెయిర్ ఆయిల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ని, అయితే తాను ఆ ప్ర‌క‌ట‌న‌ను చూడ‌లేద‌ని, కానీ తాను ఆ ప్ర‌క‌ట‌న‌ను చూస్తున్నాన‌ని భావించిన సికింద‌ర్ ఆ ఆలోచ‌న చేయ‌కు డాడ్ అని త‌న‌కు చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. త‌న‌కు చ‌క్క‌ని హాస్య‌భావ‌న ఉన్న కుటుంబం ల‌భించింద‌ని, అది త‌న‌కు చాలా స‌హాయ‌ప‌డుతుంద‌ని తెలిపారు. యువ‌త‌తో ఏకే, అనుప‌మ్ జీ అని పిలిపించుకోవాల‌ని త‌న‌కు ఎప్పుడూ కోరిక‌గా ఉంటుంద‌ని, వారితో ఏఐ, హెల్త్‌, సైన్స్ వంటి విష‌యాల‌ను చ‌ర్చించ‌డం అంటే త‌నకు ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపారు.

ఖోస్లా కా ఘోస్లా 2తో బిజీ..

అనుప‌మ్ ఖేర్ ప్ర‌స్తుతం హిందీలో ప‌లు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ప్ర‌శాంత్ భాగియా డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఖోస్లా కా ఘోస్లా 2 చిత్రంలో న‌టిస్తున్నారు. 2006లో రిలీజ్ అయిన ఖోస్లా కా ఘోస్లా చిత్రానికి సీక్వెల్‌గా రెండో పార్ట్‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ణ‌వీర్ షోరే, ప‌ర్విన్ ద‌బాస్‌, కిర‌ణ్ జునేజా, బోమ‌న్ ఇరానీ న‌టిస్తున్నారు. ఈ ఏడాది ఆగ‌స్టు 28న ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment