
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న తన సోదరుడు మంచు విష్ణు, ఆయన కుటుంబ భద్రత కోసం నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో భావోద్వేగ మెసేజ్‌ను పోస్టు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె వివరాలను వెల్లడించారు. ఈ క్లిష్ట సమయాల్లో దుబాయ్‌లో ఉన్న విష్ణు, ఆయన అందమైన కుటుంబం సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనవాళ్ల విషయంలో అయితే మనసుకు మరింత బాధగా అనిపిస్తుంది. మీ అందరినీ నా హృదయంలో దగ్గరగా ఉంచుకున్నాను. దేవుని కృప మీ చుట్టూ ఉండాలి. ప్రేమ మాత్రమే గెలవాలి.. అని మంచు లక్ష్మి పోస్టు పెట్టారు.
Praying for Vishnu and his beautiful family to stay safe and protected in Dubai during these difficult times. When it’s your own, it hits differently. Holding you all close in my heart. May God’s grace surround you. Only love shall prevail. 🤍
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 2, 2026
మంచు విష్ణు పోస్ట్..
ఇటీవల మంచు విష్ణు దుబాయ్ నుంచి ఒక వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో రాత్రి ఆకాశంలో క్షిపణులు కనిపించాయి. ఇంటి మీదుగా వినిపించిన భారీ ఇంటర్‌సెప్షన్ శబ్దాలు తన కుమార్తె ఆయ్రాను భయపెట్టాయని తెలిపారు. ఈ రాత్రి దుబాయ్‌లో కుటుంబాన్ని సందర్శిస్తున్నాను. ఆకాశంలో క్షిపణులు కనిపిస్తున్నాయి. పెద్ద శబ్దాలు మా ఇంటిని కంపించాయి, చిన్న ఆయ్రా భయపడింది. శాంతి కోసం ప్రార్థిస్తున్నాను. ఎక్కడా ఏ చిన్నారి యుద్ధ శబ్దాల మధ్య పెరగకూడదు.. అని విష్ణు పోస్టు పెట్టారు. అలాగే యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు తెలిపారు. పౌరులను సురక్షితంగా ఉంచుతున్న యూఏఈ రక్షణ బలగాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత సున్నితమో గుర్తుచేస్తాయి. శక్తి, శాంతి కోసం ప్రార్థనలు. హర్ హర్ మహాదేవ్.. అని పేర్కొన్నారు.
In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.
Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.
Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY
— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై పలువురు సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తమిళ స్టార్ అజిత్ కుమార్ కూడా ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్నారు. ఆయన చెన్నైకి తిరిగి రావాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం దుబాయ్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేయడంతో ప్రయాణం సాధ్యపడలేదని ఆయన మేనేజర్ వెల్లడించారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు, ప్రముఖులు తమ భద్రతపై అప్రమత్తంగా ఉన్నారు.












