పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 8, 2026 నుంచి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

February 7, 2026 12:23 PM
PNB Apprentice recruitment 2026 notification for 5138 posts.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ స్థాయిలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ. Photo Credit: Indira Securities.

దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 8, 2026 నుంచి బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీని ఫిబ్రవరి 24, 2026గా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు మొత్తం 12 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో రెండు వారాల ప్రాథమిక శిక్షణ (Basic Training), అనంతరం 50 వారాల పాటు ఆన్-ది-జాబ్ ట్రైనింగ్ అందిస్తారు. శిక్షణ పూర్తయ్యాక నిర్వహించే తుది అసెస్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అప్రెంటిస్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు.

అర్హతలు – వయో పరిమితి:

2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసెబిలిటీ (PwBD) అభ్యర్థులకు 10 సంవత్సరాలు వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఇస్తారు. జనరల్/ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన విడోలు, విడాకులు తీసుకున్న మహిళలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన విడోలు, విడాకులు తీసుకున్న మహిళలకు ఈ సడలింపు 40 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.

స్టైపెండ్ వివరాలు:

గ్రామీణ, అర్ధగ్రామీణ, పట్టణ శాఖల్లో పని చేసే అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300 స్టైపెండ్ అందిస్తారు. మెట్రో నగర శాఖల్లో నియమితులయ్యే వారికి నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

శిక్షణ కాలం ముగిసిన తర్వాత నిర్వహించే తుది అసెస్‌మెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే అప్రెంటిస్ సర్టిఫికెట్ అందజేస్తారు. ప్రాథమికంగా రాత పరీక్షను 2026 మార్చి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ pnb.bank.in/Recruitment లేదా BFSI SSC అధికారిక వెబ్‌సైట్ bfsissc.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని బ్యాంక్ సూచించింది.

గ‌మనిక‌: అభ్య‌ర్థులు అధికారిక నోటిఫికేష‌న్ లేదా వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి వివ‌రాల‌ను ధ్రువీక‌రించుకోవాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment