విడాకుల వార్తలకు ప్రియాంక చెక్.. నిక్ జోనాస్‌పై ప్రేమతో ఎమోషనల్ పోస్ట్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ వార‌ణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన భర్త గాయకుడు-నటుడు నిక్ జోనాస్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తోంది.

February 7, 2026 10:58 AM
Priyanka Chopra and Nick Jonas together in a recent photo.
భర్త నిక్ జోనాస్ కొత్త ఆల్బమ్ సందర్భంగా ప్రియాంక భావోద్వేగపూరిత పోస్ట్. Photo Credit: Priyanka Chopra/Instagram.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ వార‌ణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన భర్త గాయకుడు-నటుడు నిక్ జోనాస్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తోంది.

వార‌ణాసి సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతుండగా, తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలోనూ ప్రియాంక, నిక్‌తో కలిసి దిగిన వ్యక్తిగత ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఆయన తాజా ఆల్బమ్ సండే బెస్ట్ కు స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

నిక్ జోనాస్‌పై ప్రేమ‌తో పోస్టు..

నిక్‌ను కేవలం ఓ కళాకారుడిగా మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామిగా కూడా ప్రశంసిస్తూ ప్రియాంక భావోద్వేగభరితమైన సందేశం రాసుకొచ్చింది. నా భావాలను పూర్తిగా వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు, అయినా ప్రయత్నిస్తున్నాను. నువ్వు కలలతో తయారైనవాడివి. నిన్ను ప్రేమించే, గౌరవించే, నిధిలా చూసుకునే వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడం అదృష్టం. నిన్ను నా జీవితంలోకి తీసుకువచ్చిన ఈ విశ్వానికి నేను కృతజ్ఞురాలిని. నా జీవితంలో నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం నువ్వే.. అని ఆమె పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

విడాకులు లేవ‌ని చెప్పేందుకా..?

అలాగే నిక్ తాజా సంగీత ఆల్బమ్ సండే బెస్ట్ తనకు ఎంతో ప్రత్యేకమని, దానిపై తాను చాలా గర్వపడుతున్నానని ప్రియాంక తెలిపింది. ఈ పోస్ట్ అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించగా, ఇద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధం, పరస్పర మద్దతుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే నిక్ జోనాస్‌కు ప్రియాంక విడాకులు ఇవ్వ‌బోతుంద‌నే ప్రచారం ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలోనే ప్రియాంక చోప్రా ఈ పోస్టు పెట్ట‌డం ప్రాధాన్య‌తను సంతరించుకుంది. త‌మ మ‌ధ్య విభేదాలు ఏమీ లేవ‌ని, తాము విడాకులు తీసుకోబోవ‌డం లేద‌నే విష‌యాన్ని సింబాలిక్ గా చెప్ప‌డం కోస‌మే ప్రియాంక ఈ పోస్టు పెట్టి ఉంటుంద‌ని భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment