టెన్త్‌, ఇంట‌ర్ చ‌దివిన వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

January 15, 2026 9:13 PM

మీరు టెన్త్ లేదా ఇంట‌ర్ చ‌దివారా..? ప‌్ర‌భుత్వ ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ అవ‌కాశం మీ కోస‌మే. డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ (DGAFMS)లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా అకౌంటెంట్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, ఎల్‌డీసీ, స్టోర్ కీప‌ర్‌, ఫైర్‌మ్యాన్‌, కుక్‌, మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. మొత్తం 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఫిబ్ర‌వ‌రి నెల మొత్తం గడువు ఇచ్చారు. ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.

టెన్త్ లేదా ఇంట‌ర్ పాస్ అయిన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. అకౌంటెంట్ పోస్టుకు మాత్రం బీకామ్ చ‌దివి ఉండాలి. క‌నీస వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు ఉండాలి. గ‌రిష్టంగా 30 ఏళ్ల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.

DGAFMS Group C Recruitment 2025 full details

https://dgafms24.onlineapplicationform.org/DGAFMS/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అభ్య‌ర్థులు మ‌రింత స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. ఈ సైట్‌లోనే ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై చేయ‌వ‌చ్చు. ఇందులో అభ్య‌ర్థులు ముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవాలి. త‌రువాత అప్లికేష‌న్ ఫామ్ నింపాలి. అందులో వ్య‌క్తిగ‌త వివ‌రాలు, విద్యార్హ‌త వివ‌రాలు, ప‌ని అనుభ‌వం ఉంటే ఆ వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. త‌రువాత అవ‌స‌రం అయిన ధ్రువ ప‌త్రాల‌ను అప్ లోడ్ చేయాలి. ఫోటో, సంత‌కం, ధ్రువ‌ప‌త్రాల‌ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంత‌రం అప్లికేష‌న్ ఫీజు చెల్లించాలి. త‌రువాత అప్లికేష‌న్‌ను స‌బ్ మిట్ చేయ‌వ‌చ్చు.

ఈ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ఫిజిక‌ల్ టెస్ట్‌, ధ్రువ ప‌త్రాల ప‌రిశీల‌న ద్వారా అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేస్తారు. ఫైర్ మ‌న్‌, ఎంటీఎస్ పోస్టుల‌కు ఫిజిక‌ల్ టెస్ట్ ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు 7వ పే క‌మిష‌న్ ఆధారంగా వేత‌నాల‌ను చెల్లిస్తారు. ఆస‌క్తి ఉన్న‌వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now