రైల్వేలో భారీగా ఉద్యోగ నియామ‌కాలు.. ఇంట‌ర్‌, డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

January 15, 2026 9:13 PM

రైల్వేలో జాబ్ పొందాల‌ని చూస్తున్నారా..? అయితే ఈ నోటిఫికేష‌న్ మీ కోస‌మే. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా మొత్తం 1036 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు రైల్వే శాఖ‌ల‌లో ప‌నిచేసేందుకు గాను ఇంట‌ర్‌, డిగ్రీ లేదా పీజీ చ‌దివిన ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు గాను ఫిబ్ర‌వ‌రి 16ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://www.rrbapply.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌, స్టాఫ్ అండ్ వెల్పేర్ ఇన్‌స్పెక్ట‌ర్‌, చీఫ్ లా అసిస్టెంట్‌, కుక్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌, ఫిజిక‌ల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, అసిస్టెంట మిస్ట్రెస్‌, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌, హెడ్ కుక్‌, ఫింగ‌ర్ ప్రింట్ ఎగ్జామిన‌ర్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేస్తారు. పోస్టును బ‌ట్టి విద్యార్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకోవాలంటే పైన ఇచ్చిన లింక్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఇక అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 48 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

RRB Recruitment 2025 know full details

ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.500గా నిర్ణ‌యించారు. రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిల‌కు చెందిన అభ్య‌ర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. రాత ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/3వ మార్కును క‌ట్ చేస్తారు. ఆస‌క్తి ఉన్న వారు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now