Viral Video : పెళ్లిలో గొడ‌వ‌.. మ‌ట‌న్ కూర స‌రిగ్గా వేయ‌లేద‌ని త‌న్నుకున్నారు..!

January 15, 2026 9:13 PM

Viral Video : పెళ్లిళ్లు జ‌రిగిన‌ప్పుడు అతిథుల‌కు విందు భోజ‌నం వడ్డించడం మామూలే. ఎవ‌రి స్థోమ‌త‌కు త‌గిన‌ట్లుగా వారు వివాహ భోజ‌నాలు పెడుతుంటారు. ఇక తెలంగాణ‌లో అయితే చాలా వ‌ర‌కు వివాహాల్లో కచ్చితంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే. నాన్ వెజ్ లేనిదే తెలంగాణ‌లో ఏ శుభ కార్యం పూర్తి కాద‌నే చెప్పాలి. అయితే నాన్ వెజ్ పెట్టి అంద‌రికీ స‌రిపోయేలా వ‌డ్డిస్తే ఓకే. లేదంటే గొడ‌వ‌లు అయిపోతాయి. అవును, స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది అక్క‌డ‌. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న న‌వీపేట అనే ప్రాంతంలో ఈమ‌ధ్యే ఒక పెళ్లి జ‌రిగింది. వివాహ వేడుక‌లో భాగంగా మ‌ట‌న్ కూర‌ను వ‌డ్డించారు. అయితే త‌మ‌కు మ‌ట‌న్ కూర‌ను స‌రిగ్గా వేయ‌డం లేద‌ని, కొంచెమే వేస్తున్నార‌ని వ‌రుడు త‌ర‌ఫున వ‌చ్చిన బంధువులు గొడ‌వ‌కు దిగారు. దీంతో చిలికి చిలికి గాలి వాన‌గా మారిన‌ట్లు గొడ‌వ కాస్తా పెద్ద‌దైంది.

bride and groom side relatives in marriage Viral Video
Viral Video

ఈ క్ర‌మంలో వ‌రుడు, వ‌ధువు.. ఇరు ప‌క్షాల‌కు చెందిన వారు ర‌క్తాలు వ‌చ్చేలా త‌న్నుకున్నారు. అయితే స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని అక్క‌డ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డేలా చూశారు. త‌రువాత ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన 11 మందిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం అంతా బాగానే ఉంద‌ని తెలిపారు. అయితే ఈ ఘ‌ట‌న తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజ‌న్లు ఈ వీడియోకు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now