---Advertisement---

PhonePe Personal Loan : ఫోన్ పే వాడుతున్న వారికి ఈ శుభవార్త గురించి తెలుసా? తెలియ‌క‌పోతే త‌ప్పక తెలుసుకోండి!

January 15, 2026 9:13 PM
---Advertisement---

PhonePe Personal Loan : ఈ రోజుల్లో లోన్ అనేది ప్ర‌తి ఒక్క‌రికి నీడ్ అయిపోయింది. ఆర్థిక ఇబ్బందులతో బాధ‌ప‌డే వారు త‌ప్ప‌క‌ లోన్ తీసుకోవాలని అనుకొని ఉంటారు. కొన్ని సంద‌ర్భాల‌లో కొంద‌రికి లోన్ రావ‌చ్చు, మ‌రి కొంద‌రికి రాక‌పోవ‌చ్చు. అయితే ఫోన్‌పే వాడుతూ ఉంటే సులభంగానే రుణం కోసం అప్లై చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. రూ. 25 వేల నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చు. మీరు కూడా ఇంట్లో కుర్చిలో కూర్చొని ఫోన్ పే ద్వారా లోన్ పొంద‌వ‌చ్చు.

ఫోన్ పే ద్వారా లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? పర్సనల్ లోన్ పూర్తి వివరాలు ఏంటివి? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయగానే పైన మీకు పలు స్లైడ్స్ కనిపిస్తాయి. వీటిల్లో ప్రిఫర్ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 2 నిమిషాల్లో రూ.25 వేల‌ నుంచి రూ. 5 లక్షల వరకు లోన్ పొందొచ్చని ఉంటుంది.లోన్ మొత్తాన్ని ఎంచుకున్నాక ఈఎంఐ ఆప్ష‌న్ కూడా ఇక్క‌డ ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత లోన్ యొక్క అన్ని నిబంధ‌న‌లు, క‌ట్టుబ‌డి అంగీక‌రించవ‌ల‌సి ఉంటుంది.

PhonePe Personal Loan how to get it eligibility and required documents
PhonePe Personal Loan

ఆ త‌ర్వాత మీరు అడిగిన మొత్తం స‌మాచారాన్ని పూరించ‌డ‌మే కాకుండా ప‌త్రాల‌ని జ‌త చేయాల్సి ఉంటుంది. మీరు చేయాల్సిందంతా చేస్తే కొద్ది నిమిషాల‌లో లోన్ మొత్తం మీ ఖాతాకి బ‌దిలీ చేయ‌డం జ‌రుగుతుంది. ఇలా ఇంట్లో కూర్చొని ఐదు నిమిషాల‌లో లోన్ సుల‌భంగా పొంద‌వ‌చ్చు.ఇప్పటి వ‌ర‌కు మీకు ఫోన్ పే ఆప్ష‌న్ ద్వారా లోన్ తీసుకోవాల‌నేది తెలియ‌క‌పోతే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో సుల‌భంగా లోన్ పొందండి. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసి, మీరు ఇంటిలో కూర్చొని వ్యక్తిగత ఋణాన్ని తీసుకోవచ్చు.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now