Gold Price Today : బంగారం కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గుతున్న ధ‌ర‌లు..!

May 14, 2024 8:20 AM

Gold Price Today : ఈమ‌ధ్య‌కాలంలో బంగారం ధ‌ర‌లు ఎలా పెరిగాయో అంద‌రికీ తెలిసిందే. ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయాయి. అయితే ఈ ధ‌ర‌ల‌కు కాస్త బ్రేక్ ప‌డింద‌నే చెప్ప‌వ‌చ్చు. బంగారం ధర‌లు క్ర‌మంగా దిగి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తులం బంగారం ధ‌ర రూ.1 ల‌క్ష‌కు చేరుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాటికి బ్రేక్ పడింది. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను చూస్తే బంగారం ధ‌ర‌లు కొనుగోలుదారుల‌కు ఊర‌ట‌నిస్తున్నాయి. గ‌డిచిన కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌ల్లో పెరుగుద‌ల లేదు. కానీ ధ‌ర‌లు మాత్రం త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇక మంగ‌ళ‌వారం కూడా బంగారం ధ‌ర‌ల్లో త‌గ్గుద‌ల క‌నబ‌డింది. మంగ‌ళ‌వారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.67,140 ఉండ‌గా, 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.73,240కి చేరింది. దేశ వ్యాప్తంగా ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇవాళ బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,290కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,370గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 67,240కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 73,350కి చేరింది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240కి చేరింది.

Gold Price Today on 14th may 2024 in hyderabad
Gold Price Today

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,140కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,240 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. మంగళవారం వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. మంగళవారం కిలో వెండిపై రూ. 100 వరకు తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ. 86,400గా ఉంది. ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది. అలాగే చెన్నై, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 86,400 వద్ద కొనసాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now