Viral Video : వామ్మో.. న‌ల్ల తాచు పామును ఒళ్లంతా చుట్టేసుకుందిగా.. వీడియో వైర‌ల్‌..!

April 26, 2024 7:30 AM

Viral Video : ఇన్ స్టాగ్రామ్ అనేక ర‌కాల కంటెంట్ తో నిండి ఉంది. డ్యాన్స్, వంట‌లు, జంతువుల‌పై ప్రేమ‌, క‌ళ‌లు ఇలా అనేక ర‌కాల కంటెంట్ లో ఇన్ స్టాగ్రామ్ లో మ‌న‌కు క‌నిపిస్తూ ఉంటాయి. ఈ సోష‌ల్ మీడియా సైట్ ల‌లో ప్ర‌జ‌లు వారికి న‌చ్చిన‌ది ఏదైనా చేయ‌వ‌చ్చు. వ్యూస్ కోసం, ఫాలోవ‌ర్స్ కోసం ఏదో ఒక‌టి కొత్త‌గా చేస్తూనే ఉంటారు. ప్ర‌జ‌లంద‌రిని ఆక‌ట్టుకోవ‌డానికి కొత్త‌గా ఉండేది, భ‌యాన్ని క‌లిగించేది, ఆశ్చ‌ర్యానికి గురి చేసేది ఇలా ఏదో ఒక‌టి చేస్తూ ఉంటారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ‌గా జంతువుల‌కు సంబంధించిన వీడియోలు ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఒక అమ్మాయి దీనిపైనే ఒక వీడియో కూడా చేసింది.

దీంతో ఈ అమ్మాయి ఇంట‌ర్నెట్ లో అంద‌రిని ఆక‌ర్షిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇఒక వైర‌ల్ వీడియోలో ఎర్ర దుస్తులు ధ‌రించిన ఒక అమ్మాయి మెడ‌లో గంభీరంగా ఉండే ఒక న‌ల్ల‌పాముతో ఉన్న ఫోటోను ఇంట‌ర్నెట్ లో ఉంచిది. ఇది చూడ‌డానికి భ‌యంక‌రంగా ఉన్న‌ప్ప‌టికి ఆమె నిర్భ‌య ప్ర‌వ‌ర్త‌న మ‌రియు ప్ర‌శాంత‌త వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అమ్మాయి యొక్క ప్ర‌శాంత‌త‌, పాము యొక్క భ‌యాన‌క ఉనికి ఆ ఫోటోకు ఒక చ‌మ‌త్కార‌మైన ఆకర్ష‌ణ‌ను తీసుకువస్తుంది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల‌ను ఈ ఫోటో ఆక‌ర్షిస్తుంది. అయితే మెడ‌లో పామును ధ‌రించిన ఈ అమ్మాయి ఎవ‌ర‌నేది ఇంత వ‌ర‌కు తెలియ‌రాలేదు.

Viral Video woman wraps cobra around her
Viral Video

అయితే ఈ ఫోటోపై వీక్ష‌కులు ఒక్కో విధంగా స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. కొంద‌రు ఆమె ధైర్య సాహాసాల‌ను మెచ్చుకుంటే కొంద‌రు మాత్రం భ‌యాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. పాముల‌తో ఇటువంటి ఆట‌లు ఆడ‌డం మంచిది కాద‌ని స‌ల‌హాలు ఇస్తున్నారు. అలాగే కొంద‌రు అది కింగ్ కోబ్రా అని, కొంద‌రు అది నాగుపాము అని అంటున్నారు. మ‌రికొంద‌రైతే అది పామే కాద‌ని అంటున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి పాముతో ఉన్న ఈ అమ్మాయి ఫోటో మాత్రం అంద‌రిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now