Scissors : ఇంట్లో క‌త్తెర‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. లేదంటే అరిష్టం సంభ‌విస్తుంది..!

April 19, 2024 3:37 PM

Scissors : మ‌న ఇంట్లోకి అవ‌స‌ర‌మ‌య్యే కొన్ని వ‌స్తువుల‌ల్లో క‌త్తెర కూడా ఒక‌టి. ఇది దాదాపు అంద‌రి ఇండ్ల‌ల్లో ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అనేక ర‌కాలుగా మ‌నం క‌త్తెర‌ను వాడుతూ ఉంటాము. అయితే ఇంట్లో ఈ క‌త్తెర‌ను మ‌నం ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఉంచుతూ ఉంటాము. కానీ క‌త్తెర‌ను త‌ప్పుడు దిశ‌లో ఉంచ‌డం వ‌ల్ల కూడా మ‌న జీవితంలో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని మీకు తెలుసా..! అవును మీరు విన్న‌ది నిజ‌మే. క‌త్తెర‌ను త‌ప్పుడు దిశ‌లో ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో స‌మ‌స్య‌లు త‌గ్గ‌వు. ఇది మ‌న ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూప‌డంతో పాటు పిల్ల‌ల‌పై కూడా ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఆర్థిక న‌ష్టాన్ని కూడా క‌లిగిస్తుంది. క‌త్తెర ఒక ప‌దునైన వ‌స్తువు. ఇది కేతువు యొక్క చిహ్నంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. మీ జాత‌కంలో గ‌నుక కేతువు చెడుగా ఉంటే, మీరు ఇంట్లో క‌త్తెర వంటి ప‌దునైన వ‌స్తువుల‌ను స‌రైన దిశ‌లో ఉంచ‌డం మంచిది.

ఇంట్లో క‌త్తెర‌ను స‌రైన దిశ‌లో ఉంచ‌డం వ‌ల్ల ఇంట్లో ఆనందంగా ఉండ‌డంతో పాటు పిల్ల‌ల‌కు కూడా చాలా మంచిది. అంతేకాకుండా ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. అంతేకాకుండా త‌ప్పు ప‌ట్టిన క‌త్తెర‌, బ్లేడ్లు, క‌త్తులు వంటి వాటిని కూడా ఇంట్లో ఉంచ‌కూడ‌దు. తుప్పు ప‌ట్టిన ఈ వ‌స్తువుల‌ను ఇంట్లో ఉంచ‌డం వ‌ల్ల కేతువు చెడిపోతుంది. క‌నుక వీటిని వెంట‌నే బ‌య‌ట‌ప‌డేయ‌డం మంచిది. మంచిగా ఉండే కేతువు జీవితంలో శాంతిని ఇవ్వ‌డంతో పాటు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఇక క‌త్తెర‌ను ఉంచ‌డానికి స‌రైన దిశ నైరుతి దిశ‌. క‌త్తెర‌తో పాటు పదునైన వ‌స్తువుల‌ను, టూల్ బాక్స్ వంటి వాటిని కూడా ఈ దిశ‌లోనే ఉంచాలి. నైరుతి దిశ‌తో పాటు వాయువ్య దిశలో కూడా వీటిని ఉంచ‌వ‌చ్చు. వీటిని ఎల్ల‌ప్పుడూ బాక్స్ ల‌లో లేదా క‌వ‌ర్ల‌ల్లో ఉంచాలి. వీటి మొన బ‌య‌టికి క‌నిపించేలా మాత్రం వేలాడ‌దీయ‌కూడ‌దు. ఇలా స‌రైన దిశ‌లో ఉంచ‌బ‌డిన వ‌స్తువులు జీవితంలో సంతోషాన్ని, శాంతిని క‌లిగిస్తాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

Scissors do not place them home in these places
Scissors

పిల్ల‌ల భ‌విష్య‌త్తులో పురోగ‌తి ఉంటుంది. ఇక క‌త్తెర‌ను మాత్రం ఈశాన్య దిశ‌లో అస్స‌లు ఉంచ‌కూడ‌దు. దీని వ‌ల్ల ఇంట్లో అశాంతి, ఒత్తిడి, ఆందోళ‌న నెల‌కొంటుంది. ఇంట్లో వారి సంబంధాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావాలు ఉంటాయి. అలాగే క‌త్తెర‌ను ప‌డ‌మ‌ర దిశలో కూడాఉంచ‌కూడ‌దు. ఈ దిశలో ఉంచ‌డం వ‌ల్ల తల్లి ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం ఉంటుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కొవాల్సి వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now