Ajay Gadu OTT Release : అజ‌య్ గాడు డైరెక్ట్‌గా ఓటీటీలోకి.. ఎందులో, ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!

January 2, 2024 2:09 PM

Ajay Gadu OTT Release : ఇటీవల “విశ్వక్‌” సినిమాతో ముద్ర వేసిన అజయ్ కతుర్వార్ ఇప్పుడు అజ‌య్ గాడు చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. “అజయ్ గాడు” టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. అజయ్ గాడు పవర్ ప్యాక్డ్ టీజర్ ఆక‌ట్టుకుంది అధిక నిర్మాణ విలువలు, ఇంటెన్స్ యాక్షన్, అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అజయ్ కతుర్వార్ ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నట్లు కనిపిస్తోంది. అజ‌య్‌గాడు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతోంది. జీ5 ఓటీటీలో సంక్రాంతి వీక్‌లోనే అజ‌య్‌గాడు మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. అజ‌య్ గాడు సినిమాలో భానుశ్రీ, శ్వేత‌మెహ‌తా హీరోయిన్లుగా న‌టించారు.

బిగ్‌బాస్‌ ఫేమ్‌ అజయ్‌ కతుర్వార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అజయ్‌ గాడు’. అజయ్‌కుమార్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై చందన కొప్పిశెట్టి టీమ్‌ నిర్మిస్తున్నారు. ‘రాగాల 24గంటల్లో, అలాంటి సిత్రాలు తరువాత పలు చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించాను. ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ చిత్రం హీరోగా నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు అజ‌య్.రెంట‌ల్ విధానంలో కాకుండా జీ5 స‌బ్‌స్క్రైబ‌ర్లు అంద‌రికి అందుబాటులో ఉండేలా ఫ్రీ స్ట్రీమింగ్‌తో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు.

Ajay Gadu OTT Release know the the streaming details
Ajay Gadu OTT Release

చంద‌న కొప్పిశెట్టితో క‌లిసి అజ‌య్ క‌తుర్వార్ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించాడు. రిలీజ్ డిలే కావ‌డంతో డైరెక్ట్‌గా ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ చేయాల‌ని నిర్మాత‌లు భావించార‌ట‌. మ‌రి ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుంద‌నేది చూడాలి. గతంలో ఎంత క‌ష్ట‌ప‌డ్డ కూడా మంచి విజ‌యాలు సాధించ‌ని అజ‌య్ ఈ సారైన హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now