Rakul Preet Singh : స్విమ్ సూట్ లో మైండ్ బ్లోయింగ్ లుక్‌తో క‌ట్టి ప‌డేసిన ర‌కుల్

December 30, 2023 9:14 PM

Rakul Preet Singh : కెరంటం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్.ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావ‌డం లేదు. తెలుగులో పూర్తిగా సినిమాలను తగ్గించేసింది. హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలను చేస్తోంది. రకుల్ ప్రీత్ హిందీలో తాజాగా ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాను చేసింది. ఇటీవలే ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ఇక పెద్ద‌గా సినిమాలు లేని నేప‌థ్యంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంది. బీచ్ లొకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫొటోస్ షేర్ చేసి కుర్రకారు గుండెకు గాయం చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

స్విమ్ సూట్‌లో ర‌కుల్‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు థ్రిల్ అవుతున్నారు. ఆమె బ్యూటీనెస్‌ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఈ ఫొటోస్ చూసి యూత్ అంతా రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే రకుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తాజా సమాచారం. గతంలో కూడా రకుల్ పెళ్లిపై రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ గుప్పుమన్నాయి. రకుల్ అతి త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్న తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఇటీవ‌ల నటుడు, తన ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టినరోజు సందర్భంగా ఓ ఏమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. హ్యాప్పీపీపీబ‌ర్త్ డే మై లవ్.. ఈ పుట్టినరోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ నువ్వు కోరుకున్నవన్నీ సమృద్ధిగా పొందాలని ఆశీస్తున్నాను అని రాసుకొచ్చింది.

Rakul Preet Singh latest vacation photos viral
Rakul Preet Singh

ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమలో ఉండ‌గా, . తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట. అది ఎప్పుడు అనేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్. ఈ అమ్మ‌డు తెలుగులో ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్ 2, స్పైడర్ సినిమాలతో పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now