Vastu Dosham : ఈ వాస్తు దోషాలు ఉంటే మీ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బులు మొత్తం పోతాయి జాగ్ర‌త్త‌..!

December 25, 2023 11:45 AM

Vastu Dosham : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన, సమస్యలు ఉండవు. హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రాధాన్యత ఎంతో ఉంది. వాస్తు నియమాలు, దోషాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. వాస్తు దోషం ఒక్కొక్కరి పై, ఒక్కొక్కలా ప్రభావం చూపిస్తుంది. కొందరు వ్యక్తులు ఎంత కష్టపడి పనిచేసినా, డబ్బులు సంపాదించినా అవి ఖర్చయిపోతూ ఉంటాయి. ఎంత డబ్బులు దాచుకోవాలన్నా కుదరదు. డబ్బుకు సంబంధించి పనులు ఆటంకం రావడం వంటి సమస్యలు ఉంటాయి. అయితే, వాస్తు దోషాలే ఇందుకు కారణము.

ముఖ్యంగా ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వలన, అనేక సమస్యలు వస్తాయి. ఎంత డబ్బు సంపాదించిన నష్టపోతు ఉంటారు. ప్రయోజనమే ఉండదు. ధన నష్టం కలుగుతూ ఉంటుంది. వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే, ఆర్థిక సమస్యలు తప్పవు. ఇంట్లో కుళాయిలు అలా పోతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ తప్పు జరగకుండా చూసుకోవాలి. అలానే, ఇంట్లో తలుపులు తెరిచేటప్పుడు, మూసేటప్పుడు శబ్దం చేయకూడదు. తలుపులు రుద్దకూడదు అని గుర్తుపెట్టుకోండి. దీని వలన ధన నష్టం కలుగుతుంది.

if you have these Vastu Dosham in home then you will get money problems
Vastu Dosham

కాబట్టి ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి. ఇంట్లో బాత్రూం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. బాత్రూం శుభ్రంగా లేకపోతే కూడా ఇబ్బందులు వస్తాయి. అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం ఇంట్లో అనవసరమైన వస్తువులు వున్నా, ఇల్లు శుభ్రంగా లేకపోయినా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.

ఇంట్లో పాత్రలని స్టవ్ మీద పెట్టడం మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. వండేసిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంట్లో పేరుకుపోయిన మురికి ఉంటే కూడా దోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి. లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now