Roshan Kanakala : న‌ల్ల‌గా ఉన్నాడంటూ సుమ త‌న‌యుడిపై ట్రోల్స్.. గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన రోష‌న్

December 25, 2023 11:47 AM

Roshan Kanakala : తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయినటువంటి సుమ కనకాల ఇప్పుడు బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి అనేక మంది బుల్లి తెర అభిమానుల హృదయాలను కూడా దోచుకుంది. కెరీర్ స‌జావుగా సాగుతున్న సమయం లోనే తెలుగు నటుడు అయినటువంటి రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కి ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించారు. కొడుకు రోష‌న్ ఇప్పుడు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ చిత్రాలతో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఇందులో రోష‌న్ క‌థానాయకుడిగా న‌టించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ మేకర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడవిశేష్‌, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో రోషన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ట్రోల్స్ పై ఆయన స్పందన అంద‌రిని ఆశ్చర్యపరిచింది.

Roshan Kanakala strong warning to those who troll him
Roshan Kanakala

మ‌స్త్ క‌ర్రిగా ఉన్నాడు, వీడు హీరో ఏంటి” అని త‌న గురించి చాలా మాట్లాడుకోవ‌డం విన్నాన‌ని, చ‌దివాన‌ని రోష‌న్ క‌న‌కాల అన్నాడు. కర్రగా ఉన్నానా?, తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్‌ కాదని ఇక్కడ టాలెంట్‌ ముఖ్యం అని చెప్పాడు రోషన్‌. వీడేంటి మస్త్ కర్రగా ఉన్నాడు వీడు హీరో ఏంటి? హీరో మొఖం కాదు, బొక్క వేస్ట్ హీరో మెటీరియల్‌ కాదు అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు, తెలుపు, అందం కాదు బ్రదర్‌ సక్సెస్‌ ని డిసైడ్‌ చేసేది. ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్‌, డిసిప్లెయిన్‌ మాత్రమే నిర్ణయిస్తుంది. మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికీ తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్‌ అయినా, ఔకాద్‌ అయినా, ఒక రోజు వస్తది, వద్దనుకున్నా వినబడతా, చేవులు మూసుకున్నా వినబడతా. డిసెంబర్‌ 29న రాసిపెట్టుకోండి, థియేటర్‌కి వచ్చేయండి. ఆది గాడి లవ్‌ని చూడండి, ఆదిగాడి ఫైట్‌ ఫర్‌ రెస్పెక్ట్ ని చూడండి` అంటూ రోష‌న్ చాలా వీరోచితంగా మాట్లాడాడు. ఆ మాట‌ల‌కి సుమ క‌న్నీళ్లు పెట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now