Hands Colors : అరచేతులు ఈ రంగులో ఉంటే.. ఎప్పుడు దరిద్రమే ఉంటుంది..!

December 24, 2023 5:31 PM

Hands Colors : మన చేతి మీద ఉండే గీతలు బట్టి, మనం ఎటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నాము..? మన భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అలానే, మన చేతులు యొక్క రంగును బట్టి కూడా మన స్వభావం తెలుసుకోవచ్చుట. పైగా జీవితంలో, ఎప్పుడు బాధలు కలగబోతున్నాయి..? దరిద్రం పట్టుకుపోతుంది అనేవి కూడా తెలుసుకోవచ్చు. మన చేతులు పై ఉన్న గీతలే కాదు. మన చేతి రంగు కూడా, మన భవిష్యత్తుని మన వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది. మరి మీ అరచేతులును కూడా చూసుకోండి.

మీ స్వభావాన్ని, మీ భవిష్యత్తులో జరగబోయే మార్పుల్ని తెలుసుకోండి. ఒకరు వ్యక్తిత్వాన్ని చదవడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం కొంచెం సులభమే. కొంత మందికి అరచేతులు లోపల మరియు వెలుపల ఒకే రంగు ఉంటుంది. కొంతమందికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అరచేతి రంగు సాధారణంగా ఎరుపు, పసుపు, గులాబీ నుండి పూర్తిగా తెలుపు వరకు ఉంటుంది. మీ అరచేతి రంగును బట్టి, మీరు మీ గురించి తెలుసుకోవచ్చు. అర చెయ్యి గులాబీ రంగులో ఉన్నట్లయితే, ఇటువంటి వాళ్ళు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని అనుకుంటారు.

Hands Colors if you have these then you will always be in poor
Hands Colors

జీవితంలో ప్రతిదీ బ్యాలెన్స్ గా ఉంచాలని కోరుకుంటారు. ఆహారం, ఆధ్యాత్మికత వరకు ప్రతి విషయంలో కూడా క్రమశిక్షణతో వీళ్ళు ఉంటారు. ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఎర్రటి చేయి ఉన్నట్లయితే, ఎంతో కష్టపడతారట. ఎప్పుడూ కూడా, వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు. కష్టపడి పని చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ చెయ్యి పసుపు రంగులో ఉందంటే, కచ్చితంగా డాక్టర్ ని కలవాలి. అనారోగ్య సమస్యకు కారణం. ఒత్తిడి, ఆందోళన, అతిగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

అరిచేతులు కనుక తెల్లగా ఉన్నట్లయితే, చుట్టుపక్కల వాళ్ళ అందరితో కూడా మీరు మృదువుగా మాట్లాడతారు. మంచిగా ప్రవర్తించేవారు. అలానే, అందర్నీ సంతోషంగా ఉంచాలని మీరు కోరుకుంటారు. అరచేతులు ఈ రంగులో ఉంటే, అందరిని సంతోషంగా ఉంచాలని మీరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అరచేతి మీద మచ్చలు కనుక ఉన్నట్లయితే, ఆనందాన్ని కోల్పోయారని అర్థం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now