Money Saving : రూ. 222 ఆదా చేస్తే.. 15 లక్షలు వస్తాయి.. ఎలానో తెలుసా..?

December 22, 2023 7:59 PM

Money Saving : ఈరోజుల్లో ప్రతీ ఒక్కరు కూడా, ఆర్థిక సమస్యలేమీ రాకూడదని ముందు నుండి కూడా, వివిధ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా చేయడం వలన, ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈ రోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలేమీ రాకూడదని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIP) ని ఎంచుకుంటున్నారు. ఇది కూడా మంచి మార్గాన్ని అందిస్తాయి. ఇలా డబ్బులని పెడితే, మీకు బాగా ప్రాఫిట్ వస్తుంది. భవిష్యత్తు లో ఏ సమస్యా ఉండదు. ఇక దీని కోసం పూర్తి వివరాలు చూసేద్దాం.

SIPలో కేవలం ₹222 రోజు పెడితే చాలు. ఇలా, కనుక మీరు రోజు కి పొదుపు చేస్తే, నెల కి రూ.6,660 , వార్షిక పెట్టుబడి రూ. 79,920. ఇలా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, 7,99,200 అవుతుంది. ఇలా, మీరు SIP లో డబ్బులు పెట్టడం వలన ఎంత వస్తుందనేది చూస్తే.. సగటున 12% రాబడిని మీరు ఇందులో పెట్టి పొందవచ్చు.

Money Saving invest in sip and earn good income
Money Saving

12% రాబడి పదేళ్ల వ్యవధి లో మొత్తం ₹7,48,178 వడ్డీని ఇస్తుంది. SIP పదవీకాలం పూర్తి అయ్యాక, రూ.15,47,378 మీ చేతికి వస్తుంది. రిస్క్ ఉంటుంది చూసుకోవాలి. అలానే, స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని కూడా మీరు గుర్తించడం అత్యవసరం. దీని వలన ఉపయోగం ఏమిటనేది చూస్తే.. షేర్ల కొనుగోలు కోసం ఒకే సారి ఏకమొత్తం మీరు పెట్టుబడి పెట్టక్కర్లేదు.

మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ ఉంటుంది. ఏ కంపెనీ పని తీరు ఎలా ఉందో మీరు చూసుకోక్కర్లేదు. మన తరపున ఫండ్ మేనేజర్ ఆ బాధ్యతలు ని తీసుకోవడం జరుగుతుంది. పైగా తక్కువ రిస్క్ ఉంటుంది. ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయటం వలన మీకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 80 సి ప్రకారం రూ 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now