Annapoorani OTT Release Date : న‌య‌న‌తార అన్న‌పూర్ణి మూవీ అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తుందా.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

December 15, 2023 9:31 PM

Annapoorani OTT Release Date : లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపురాణి (అన్నపూర్ణ): ది గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రం నయనతార కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రంలో జై సంపత్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్‌లే తదితరులు నటించారు. ట్రైడెంట్ ఆర్ట్స్, నాడ్ స్టూడియోస్, జీ స్టూడియో నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్ నిర్మాతలుగా వ్యవహరించిన అన్నపూర్ణి సినిమాకు తమన్ ఎస్ మ్యూజిక్ అందించారు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.

డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలిసింది.డిసెంబ‌ర్ 29న అన్న‌పూర్ణి మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. థియేట‌ర్స్ లో పెద్ద‌గా అల‌రించ‌ని ఈ మూవీ ఓటీటీలో మాత్రం అలరిస్తుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. ఈ సినిమా క‌థ‌లోకి వెళితే.. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు ఎదురైనా స‌వాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వ‌చ్చిన ఒత్తిడిని త‌ట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది చిత్ర క‌థ‌.

Annapoorani OTT Release Date know the platform and streaming details
Annapoorani OTT Release Date

ప్రస్తుతం సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఈ ఏడాది నయన్ పెద్ద విజయాన్ని అందుకుంది. షారుక్‌తో నయనతార నటించిన ‘జవాన్‌’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద వేల కోట్ల రూపాయలను వసూలు చేయ‌గా, ఇందులో న‌య‌న‌తార యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో అద‌ర‌గొట్టింది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార‌కి బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కూడా అవకాశాలు వ‌స్తున్నాయి. తెలుగు, తమిళంలో అనేక పాత్రలలో అలరించిన లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్‌లోను స‌రికొత్త పాత్ర‌ల‌లో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now