Rajinikanth : ర‌జ‌నీకాంత్ అంటే మ‌రీ ఇంత ప్రేమ‌నా.. ఏం చేశారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

December 14, 2023 5:53 PM

Rajinikanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేక పరిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న తలైవా 170 టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ తెరకెక్కిస్తున్నారు. వెట్టైయాన్ టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. బుక్‌ రీడింగ్‌ తర్వాత చేతిలో స్టిక్‌ పట్టుకొని.. స్టైలిష్‌ గాగుల్స్‌ పెట్టుకున్న రజినీకాంత్‌ విజువల్స్‌ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

డిసెంబర్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. రజనీకాంత్‌కు భారతదేశంలోనే కాకుండా జపాన్, మలేషియా, దక్షిణ కొరియా, అమెరికా, యూకే, దుబాయ్‌ తదితర దేశాల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. జైలర్ మెగా హిట్ అయిన తర్వాత రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలు కూడా చాలా జోరుగా జరిగాయి. తమిళనాడులో చిన్నా పెద్ద అని తేడా లేకుండా రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ర‌జ‌నీకాంత్ సినిమాల‌తోనే కాకుండా సేవా కార్య‌క్ర‌మాలతోను ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకున్నారు.

a fan of Rajinikanth built temple for him
Rajinikanth

తమిళనాట వరదలు కావడంతో.. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే కొంతమంది అభిమానులు మాత్రం రజినీకాంత్ కోసం కట్టిన గుళ్లో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి స్పెషల్ పూజలు నిర్వహించారు. మధురైకి చెందిన కార్తీక్ అనే రజనీకాంత్ వీరాభిమాని ఆయన కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో 250 కిలోల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విగ్రహం క్రింద తన తల్లిదండ్రుల ఫోటో, గణేశుని ఫోటో ఉంచాడు. ఇక ప్రతి రోజు రజనీకాంత్ విగ్రహానికి హారతులు, అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు.. రజనీకాంత్‌ను దేవుడిగా.. తానో భక్తుడిగా మారిపోయి ప్ర‌త్యేక పూజలు చేస్తుండ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now