Mansur Ali Khan : చిరంజీవి కేసు విష‌యంలో మ‌న్సూర్‌కి చీవాట్లు పెట్టిన హైకోర్ట్

December 12, 2023 7:54 PM

Mansur Ali Khan : సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమిళనటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలిచాడు. తన పరువుకు నష్టం కలిగిందని చిరంజీవి, త్రిష, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేసి కోర్టు మెట్లు ఎక్కిన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా మద్రాస్ హైకోర్టులో మన్సూర్ అలీఖాన్ వేసిన పరువు నష్టం దావా పై విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టు మన్సూర్ అలీ ఖాన్ కు మొట్టికాయలు వేసింది. బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు త్రిషనే నీపై కేసు పెట్టాలని కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించ‌డం కొస‌మెరుపు. అంతేకాదు మీకు గొడవల్లో తలదూర్చడం బాగా అలవాటయిపోయింది అని వ్యాఖ్యానించిన హైకోర్టు ధర్మాసనం ప్రతిసారి వివాదాన్ని రేకెత్తించి ఆ తర్వాత నేను అమాయకుడిని అని చెప్పడం పరిపాటిగా మారిందని హైకోర్టు ధర్మాసనం ఆయనకు అక్షింతలు వేసింది.

నిజానికి కేసు మన్సూర్ అలీఖాన్‌పై త్రిష వేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, మన్సూర్ అలీఖాన్‌కు నిత్యం వివాదాల్లోకి దూరడం.. అంతాచేసి తనను తాను అమాయకుడినని చెప్పుకోవడం అలవాటుగా మారిందని న్యాయమూర్తి నిందించారు. మన్సూర్ అలీఖాన్ న్యాయవాది తన క్లయింట్ తప్పేమీ లేదని వాదించారు. ఒక ఇంటర్వ్యూలో చిన్న క్లిప్ కట్ చేసి తన క్లయింట్‌పై నిందలు వేశారన్నారు. అలా అయితే, ఇంటర్వ్యూ పూర్తి వీడియో కోర్టుకు చూపించాలని న్యాయమూర్తి అడిగారు. దీనికి మన్సూర్ అలీఖాన్ న్యాయవాది అంగీకరించారు. తాను పూర్తి వీడియోను కోర్టుకు సమర్పిస్తానని.. అయితే, మన్సూర్‌పై త్రిష చేసిన సోషల్ మీడియా పోస్టు తీసేయాలని న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. త్రిష, ఖుష్బూ, చిరంజీవి వారి స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. కేసును డిసెంబర్ 22కు వాయిదా వేశారు.

high court very angry on Mansur Ali Khan
Mansur Ali Khan

ఇక వివాదం విష‌యానికి వ‌స్తే.. ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ లియో చిత్రం గురించి మాట్లాడుతూ, లియో చిత్రంలో నేను చేసే సన్నివేశాలలో ఒక సన్నివేశం కూడా త్రిషతో చేయలేదని, ఒక బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నానన్నారు. అన్ని సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా త్రిషను బెడ్ రూమ్ కి తీసుకు వెళ్లవచ్చని అనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. ఇంతకుముందు చాలా సినిమాలలో తాను రేప్ సీన్లు చేశానని, కాశ్మీర్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదు అంటూ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలే ఆయనపై చిరంజీవి, ఖుష్బూ తదితరులు తీవ్రంగా స్పందించేలా చేశాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now