My Name is Shruthi OTT Release : రిలీజైన నెల రోజుల‌కే ఓటీటీలోకి వ‌చ్చిన మై నేమ్ ఈజ్ శృతి.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

December 10, 2023 10:00 PM

My Name is Shruthi OTT Release : బ‌బ్లిగ‌ర్ల్ హ‌న్సిక న‌టించిన రీసెంట్ మూవీ మై నేమ్ ఈజ్ శృతి. హన్సిక మోత్వాని, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. స్కిన్‌ మాఫియా అంశంతో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌. నవంబర్ 17న థియేటర్లలో విడుదలైన మై నేమ్ ఈజ్ శ్రుతి ఆడియెన్స్‌ను బాగానే అలరించింది. ముఖ్యంగా సస్పెన్స్‌ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ చూసే వారికి ఈ మూవీ ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని చెప్పాలి. అయితే ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 17 నుంచి హన్సిక మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ మై నేజ్ ఈజ్ శ్రుతి స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని టాక్. తెలుగుతో పాటు త‌మిళ భాష‌ల్లో మై నేమ్ ఈజ్ శృతి అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.అతి త్వ‌ర‌లోనే మై నేమ్ ఈజ్ శృతి డిజిటల్ స్ట్రీమింగ్‌కి సంబంధించి ఓ క్లారిటీ అయితే రానుంది. థియేట‌ర్స్‌లో సినిమా చూడ‌డం మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

My Name is Shruthi OTT Release know the platform and streaming details
My Name is Shruthi OTT Release

చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. ఒక యాడ్ ఏజెన్సీలో ప‌నిచేసే శ్రుతి (హన్సిక) స్కిన్ మాఫియా వ‌ల‌లో ఎలా ప‌డింది? ఆ మాఫియాను ఎదుర్కొంటూ ఆమె ఎలాంటి పోరాటాన్ని సాగించిందన్న నేప‌థ్యంలో మూవీని చాలా హృద్యంగా తెర‌కెక్కించారు. ఫస్టాఫ్‌లో ట్విస్టులు వదులుకొంటూ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంత నిదానంగా సాగడంతో మూవీ స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ ఓ మర్డర్ ట్విస్ట్ ఇచ్చి సినిమాపై ఆసక్తిని రేపడంలో దర్శకుడు సఫలమయ్యాడ‌నే చెప్పాలి .ఇక సెకండాఫ్‌పై పెట్టుకొన్న అంచనాలకు తగినట్టుగానే కథను దర్శకుడు పరుగులు పెట్టించారు. దర్శకుడి స్క్రీన్ ప్లేకు తగినట్టుగా హన్సిక ఫెర్ఫార్మెన్స్ జత కావడంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వదలిన ట్విస్టులను జాగ్రత్తగా క్లోజ్ చేసుకొంటూ వెళ్లడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులను డీల్ చేసిన తీరు అతడు రాసుకొన్న స్క్రీన్ ప్లే పాజిటివ్‌గా మారింది. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్‌తో డీల్ చేసిన విధానం బాగుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now