Guppedantha Manasu December 9th Episode : ఇంటరాగేట్ చేయడానికి వచ్చిన ముకుల్.. దొరికిపోయిన‌ శైలేంద్ర..!

December 9, 2023 10:07 AM

Guppedantha Manasu December 9th Episode : రిషి కారు, రోడ్డు మీద కానిస్టేబుల్ కి కనబడుతుంది. రిషి సార్ కారులా ఉందని, ముకుల్ కి కాల్ చేస్తాడు. కార్ ఎలా పార్క్ చేసి ఉందని అడిగితే, తెలియట్లేదు అని, కానిస్టేబుల్ చెప్తాడు. కార్ ఫోటో లొకేషన్ పెట్టమని అంటాడు. ముకుల్ వస్తున్నాడని కంగారుగా శైలేంద్ర కి దేవయాని చెప్తుంది. అప్పుడే వస్తున్నాడా, ఏం చేయాలో తెలియట్లేదు అని శైలేంద్ర అంటాడు. తప్పించుకోవడానికి ఆలోచించే టైం ఉంటుందని ఒడిపించుకున్నావు, ఎందుకు ఇప్పుడు టెన్షన్ పడుతూ ఉన్నావని దేవయాని అంటుంది.

ఏదో ఒకటి మేనేజ్ చేస్తాలే అని శైలేంద్ర అంటుంటే, కారు సౌండ్ వినపడుతుంది. ధరణి వచ్చి ముకుల్ రమ్మంటున్నారని చెప్తుంది. నేను తీసుకొస్తా వెళ్ళు అని ధరణిని పంపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు నేను ఏదో ఒకటి చేసి పంపించేస్తాను అని దేవాయని హాల్లోకి వెళ్తుంది. ఏంటండీ మీరు. డిశ్చార్జ్ అయింది ఇప్పుడే కదా, ఒక నాలుగు ఐదు రోజులు రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత మీరు వచ్చాక అన్నీ చెప్తాడని దేవయాని అంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడే, ఇంట్రాగేషన్ చేస్తాము కానీ, మీకు ఇంత టైం ఇచ్చాము. మా పై అధికారులకి అప్డేట్ ఇవ్వాలి కదా అని ముకుల్ చెప్తాడు.

హాస్పిటల్ నుండి వచ్చిన వాడు, హాల్లోకి రాలేడా..? వీల్ చైర్ కూడా ఉంది కదా అని అనుపమ అంటుంది. చట్టం దగ్గర ఇవేమీ ఉండవని అనుపమ అంటుంది. బెడ్ రూమ్ లోకి మీరే వెళ్లి మాట్లాడడం ఓకే కదా అని వసుధారా అంటుంది. శైలేంద్ర ఇక్కడికి రావడమే కరెక్ట్ అని ఫణింద్ర అంటాడు. దాంతో నేను వెళ్లి తీసుకొస్తాను అని మహేంద్ర అంటాడు. అక్కడికి వెళ్తే తప్పించుకునేలా చేస్తావు వదిన అని, మనసులో అనుకున్న మహేంద్ర బెడ్ రూమ్ లోకి వెళ్తాడు. యముడు వచ్చాడని శైలేంద్రని మహేంద్ర తీసుకువస్తాడు.

Guppedantha Manasu December 9th Episode today
Guppedantha Manasu December 9th Episode

పై అధికారులపై మీకు గోల్ లేదా అని ముకుల్ అడిగితే, అమ్మానాన్న చెప్పింది చేయడమే తప్ప ఇంకేం లేదు అని అంటాడు. ఒకసారి ఎండి సెట్ లో కూర్చుంటానని అన్నారు కదా సార్ అని వసుధారా అంటుంది. సారధి మీ స్నేహితుడే కదా, రిషి ఫ్రాడ్ చేసినట్లు ఇష్యూ చేసింది అతనే. కానీ జగతిని ఎవరు బ్లాక్మెయిల్ చేసారు. ఇలా ఇవన్నీ ముకుల్ అడుగుతాడు. సారధి వెనుక ఎవరైనా ఉండొచ్చు కదా అని వసుధారా అంటుంది.

ఎమ్మెస్సార్ కూడా మీ ఫ్రెండ్ కదా..? కాలేజ్ ని చేతికించుకోవాలనుకున్న అతను నుండి అప్పు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతాడు. అలానే సంతకం ఎందుకు చేశారు అని అడుగుతాడు. అప్పుడు సరిగ్గా చూడలేదు అని శైలేంద్ర అంటాడు. అలా చూడకుండా ఉంటే, కొంచెమైనా బుద్ధి లేదా అని అనుపమంటుంది. కాలేజ్ మీ చేతుల్లో లేకపోతే ఏం చేస్తారు అని ముకుల్ అడిగితే, అడుక్కు తింటాడు.

10 నిమిషాలు అని ఇన్ని ప్రశ్నలు ఏంటని దేవయాని మండిపడుతుంది. శైలేంద్ర వాయిస్ వినిపిస్తాడు. అనుపమ షాక్ అవుతుంది. షూటర్ తో శైలేంద్ర మాట్లాడింది ధరణి గుర్తు చేసుకుంటుంది. ఇది ఆయన వాయిస్ ఏ అని అనుకుంటుంది. అచ్చం నా వాయిస్ లాగే ఉందని శైలేంద్ర అంటాడు. మీలా కాదు మీదే అని 100% మా నమ్మకం. నీదేనా ఈ వాయిస్ అని అడుగుతాడు ముకుల్. శైలేంద్ర సైలెంట్ అయిపోతాడు. మీరేనా అని ముకుల్ మళ్ళీ అడుగుతాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now