Fact Check: క్యాడ్‌బ‌రీ డెయిరీ మిల్క్ చాకొలెట్ల‌లో బీఫ్ క‌లుస్తుందా ? నిజ‌మెంత ?

July 19, 2021 5:42 PM

సోష‌ల్ మీడియాలో ఎవ‌రు సృష్టిస్తున్నారో తెలియ‌డం లేదు కానీ ఈ మ‌ధ్య పుకార్లు బాగా పెరిగిపోయాయి. చాలా ఫేక్ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నారు. వాటిని కొంద‌రు నిజ‌మే అని న‌మ్మి న‌ష్ట‌పోతున్నారు. ఇక తాజాగా ఇంకో ఫేక్ వార్త బాగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..

is it true that cadbury dairy milk chocolates contain beef fact check

క్యాడ్‌బ‌రీ డెయిరీ మిల్క్ చాకొలెట్ల‌లో బీఫ్ క‌లుస్తుంద‌ని ఒక వార్త ప్ర‌చారం అవుతోంది. స‌ద‌రు చాకొలెట్ల‌లో గెలాటిన్ అనే ప‌దార్థం ఉంటుందని, అది బీఫ్ నుంచి వ‌స్తుంద‌ని, క‌నుక ఆ చాకొలెట్లలో బీఫ్ క‌లుస్తుంద‌ని.. ఓ వార్త ప్రచారం అవుతోంది.

అయితే దీనిపై క్యాడ్‌బ‌రీ సంస్థ స్పందించింది. త‌మ‌కు సంస్థ‌కు చెందిన డెయిరీ మిల్క్ చాకొలెట్లు మాత్ర‌మే కాదు, ఏ ఉత్ప‌త్తిలోనూ బీఫ్ క‌ల‌వ‌ద‌ని, ప్యాక్‌పై గ్రీన్ క‌ల‌ర్ చుక్క ఉంటుందని, దాన‌ర్థం ఆ ఫుడ్ పూర్తిగా శాకాహార‌మేన‌ని.. అందువ‌ల్ల సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న ఇలాంటి వార్త‌ల‌ను నమ్మ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment