50వేల సినిమాల‌ను ఒక్క సెక‌న్‌లోనే డౌన్‌లోడ్ చేయ‌వ‌చ్చు.. అంత‌టి హైస్పీడ్ ఇంట‌ర్నెట్ వేగాన్ని సాధించిన జ‌పాన్‌..!

July 19, 2021 3:30 PM

టెక్నాల‌జీ పేరు చెప్ప‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే దేశాల్లో జ‌పాన్ తొలి స్థానంలో ఉంటుంది. అక్క‌డ సాంకేతిక రంగంలో ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. వ‌స్తూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌పాన్ దేశం మ‌రో అద్భుత‌మైన ఘ‌న‌త‌ను సాధించింది. ఏకంగా 319 టెరాబైట్స్ ప‌ర్ సెకండ్ ఇంట‌ర్నెట్ స్పీడ్‌ను సాధించింది. అంటే 50వేల సినిమాల‌ను ఒక్క సెక‌న్‌లోనే డౌన్‌లోడ్ చేయ‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఊహించుకుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది క‌దా. ఇక నిజంగా ఆ స్పీడ్‌ను వాడితే ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

japan achieved worlds highest internet speed of 319 tbps

గ‌తంలో యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ లండ‌న్‌కు చెందిన ప‌రిశోధ‌కులు 178 టీబీపీఎస్ స్పీడ్‌ను సాధించారు. అయితే ప్ర‌స్తుతం జ‌పాన్‌కు చెందిన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేషన్స్ టెక్నాల‌జీ 319 టీబీపీఎస్ స్పీడ్‌ను సాధించింది. ఇక ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ఇంట‌ర్నెట్ స్పీడ్ ఇదే కావ‌డం విశేషం.

ఇంత‌టి స్పీడ్ ద్వారా సుమారుగా 50వేల సినిమాల‌ను ఒక్క సెక‌న్‌లోనే డౌన్ లోడ్ చేయ‌వ‌చ్చు. ఇక గ‌తంలోనూ ప‌లు దేశాలు హైస్పీడ్ ఇంట‌ర్నెట్ వేగాల‌ను సాధించాయి. అవి దీని ముందు త‌క్కువే. అయితే నాసా 400 జీబీపీఎస్ ఇంట‌ర్నెట్ స్పీడ్ ను మాత్ర‌మే ఉప‌యోగిస్తుంది. అంత‌క‌న్నా జ‌పాన్ సాధించిన స్పీడే అధికం కావ‌డం మ‌రో విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment