Anasuya : యానిమ‌ల్ సినిమాలో బోల్డ్ సీన్స్ చూడ‌లేదా.. అన‌సూయ‌పై తెగ ట్రోలింగ్

December 3, 2023 5:52 PM

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోకి యాంక‌రింగ్‌తో అందరి మ‌న‌స్సులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత న‌టిగా కూడా మారింది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ‌త్త‌గా అన‌సూయ న‌ట విశ్వ‌రూపం ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు గెలుచుకుంది. అన‌సూయ సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో అనసూయ ఇచ్చే ఫోజులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ అమ్మ‌డిపై ఎంత ట్రోలింగ్ చేసిన కూడా కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుని తెగ అల‌రిస్తూ ఉంటుంది. అన‌సూయ అందాల‌ని కొంద‌రు ఆస్వాదిస్తుండ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అన‌సూయ.. ఓట‌మి త‌ర్వాత కేటీఆర్ చేసిన ట్వీట్‌కి స్పందించింది. ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన మీరు నిజమైన లీడర్ సార్. అయితే ఈ సారి మీకు ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను కూడా అదే విధంగా బాధ్యతగా మీరు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి క్షణం అభివృద్ధి చేస్తూ హైదరాబాద్‌తో మళ్లీ మళ్లీ ప్రేమలో పడే విధంగా చేసిన మీకు పెద్ద థాంక్యూ అని రాసుకొచ్చింది. దీనిపై థాంక్యూ ఆంటీ, చెప్పింది చాలులే కానీ, అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటి చేస్తే చాలదు ఆంటీ, పెయిడ్ ఆర్టిస్ట్, అసలు నువ్వు ఓటేశావా అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Anasuya being trolled for animal movie scenes
Anasuya

మ‌రోవైపు కొద్ది రోజుల క్రితం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఇన్‌డైరెక్ట్ గా హాట్ హాట్ కామెంట్స్ చేసి సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారింది. అర్జున్ రెడ్డి చిత్రంలో డైలాగ్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనసూయ వివాదం సృష్టించింది. చాలా కాలం పాటు అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం,మాటల యుద్ధం కొనసాగడం చూశాం. అయితే రీసెంట్‌గా వ‌చ్చిన యానిమల్ చిత్రంలో చాలా అసభ్యకరమైన సన్నివేశాలు, బూతు డైలాగులు ఉండ‌గా, దీనిపై అనసూయ ఎందుకు స్పందించ‌డం లేదంటూ కొంద‌రు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అయితేనే మాట్లాడ‌తావా, ఇత‌రుల సినిమాల‌పై మాట్లాడ‌వా అంటూ అన‌సూయ‌ని వివాదంలోకి లాగి ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ఈ కామెంట్స్‌పై అన‌సూయ స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now