Polimera 2 OTT Release Date : పొలిమేర 2 ఓటీటీ స్ట్రీమింగ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

December 2, 2023 3:16 PM

Polimera 2 OTT Release Date : సత్యం రాజేష్‌, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్‌ శ్రీను లీడ్ రోల్స్ లో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మా ఊరి పొలిమేర-2 . అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గౌరికృష్ణ నిర్మించారు. నవంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా, పొలిమేరకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. జ్ఞాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మూవీకి హైలైట్ గా నిలిచింది. పొలిమేర సినిమాకు సీక్వెల్‍ గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ తెరకెక్క‌గా ఇందులో సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ మరియు రాఖేందు మౌళి కీలకపాత్రలు పోషించారు.

పొలిమేర-2 సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించడం తో పాటు కథ, స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్స్ కూడా అందించారు. ఈ సినిమా ను గౌర్ కృష్ణ నిర్మించగా,గ్యానీ సంగీతం అందించారు.కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా శ్రీవర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా శ్రీవర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.పొలిమేర 2 డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబరు 08న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.

Polimera 2 OTT Release Date know which platform streaming
Polimera 2 OTT Release Date

మూఢనమ్మకాలు, చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన పొలిమేర మెుదటి పార్టుకు ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో దానికి సీక్వెల్ గా సేమ్ కాన్సెప్ట్ తో పొలిమేర 2ను రూపొందించారు మేకర్స్. మెుదటి పార్టును ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఎండ్ చేసి.. సెకండ్ పార్ట్ పై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. దీంతో పొలిమేర 2ను థియేటర్లలో రిలీజ్ చేసి సక్సెస్ చేశారు. ఈ మూవీలో సత్యం రాజేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినా వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now