Alia Bhatt : ఈసారి ఆలియా భ‌ట్ వంతు.. వైర‌ల్ అవుతున్న ఫేక్ వీడియో..!

November 28, 2023 1:04 PM

Alia Bhatt : ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టార్ హీరో, హీరోయిన్స్‌ని వేధించ‌డాలు ఎక్కువ‌య్యాయి.సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. డీప్ ఫేక్ వీడియో అంటూ కొత్త‌గా హీరోయిన్స్‌ని వేధించ‌డం ఎక్కువైంది. ఇటీవ‌ల ర‌ష్మిక‌ ఫేస్‌ మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్మిక ఎద అందాలు చాలా దారుణంగా ప్రదర్శించినట్టుగా ఈ వీడియోలో చూపించారు. బ్లాక్ కలర్ డ్రెస్‌లో, అసభ్య కరంగా ఎక్స్ పోజింగ్‌తో లిఫ్ట్‌లో వెళుతున్నట్టు రష్మికను దారుణంగా ఆ వీడియోలో చూపించార. ఆ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దుస్తులు మార్చుకుంటున్నట్టు మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది.

అయితే ఇది కూడా మార్ఫింగ్ వీడియో అని స్ప‌ష్టంగా అర్ధ‌మైంది. ఆ త‌ర్వ‌త క‌త్రినా కైఫ్ వీడియో కూడా ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఇక ఇప్పుడు తాజాగా మరో స్టార్‌ నటి డీప్‌ఫేక్‌ బారిన పడ్డారు.‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్‌ భామ అలియా భట్ కు సంబంధించిన ఫేక్‌ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. వీడియో చూడగానే మనకు ఫేక్ వీడియో అని అర్ధమవుతుంది. వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు.

Alia Bhatt deep fake video viral on social media
Alia Bhatt

దీనిపై అలియా భట్ స్పందించాల్సి ఉంది. మరోవైపు డీప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా, ర‌ష్మిక ఫేక్ వీడియోపై అమితాబ్ బచ్చన్ చిరంజీవి, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ కవిత, నాగ చైతన్య, చిన్మయి శ్రీపాద, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా స్పందించారు. ఈ ఘటనపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

https://twitter.com/DDieheart/status/1729032335201644915

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now