Chinna In OTT : సిద్ధార్థ్ చిన్నా ఎట్ట‌కేల‌కి ఓటీటీలోకి వ‌చ్చేసింది.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

November 28, 2023 12:06 PM

Chinna In OTT : బొమ్మ‌రిల్లు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన సిద్ధార్థ్ ఇటీవ‌ల వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. ఫ్యామిలీ డ్రామా, థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో చిత్తా అనే సినిమా చేశాడు. తెలుగులో చిన్నా పేరుతో ఈ మూవీ విడుద‌లైంది. గత వారం 17నే డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్లో విడుదల అవుతుందని ప్రకటించి కొన్ని అనివార్య కారణాల వల‌న వాయిదా వేశారు. తాజాగా సదరు ఓటీటీ సంస్థ మరోసారి చిన్నా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ఎనౌన్స్ చేసింది. నవంబర్ 28 నుంచి తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో సినిమా స్ట్రీమింగ్ జరుగనున్నట్లు ప్రకటించింది.ఎస్‌యూ అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఓ మోస్తరు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌ చిన్నామూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ధార్థ్‌ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు నిమిషా విజయన్, సహస్ర శ్రీ, అంజలి నాయర్ కీలక పాత్రలు పోషించారు. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్‌ వంటి సున్నితమైన అంశాలను ఎంతో ఎమోషనల్‌గా చూపించారు. హీరో సిద్ధార్థ్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇక సిద్ధార్థ్‌ చిన్నా మూవీ కథ విషయానికి వస్తే.. అన్నయ్య చనిపోవడంతో వదిన, పాపను తానే చూసుకుంటుంటాడు ఈశ్వర్‌ (సిద్ధార్థ్‌). ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ వారిద్దరిని పోషిస్తుంటాడు. అయితే నగరంలో చిన్న పిల్లలు వరుసగా కిడ్నాప్‌లకు గురవుతారు.

Chinna In OTT sidharth latest movie now streaming
Chinna In OTT

వారిని అత్యాచారం చేసి దారుణంగా చంపుతుంటారు. ఈశ్వర్‌పై కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిని అరెస్ట్‌ చేస్తారు. ఇదే సమయంలో ఈశ్వర్‌ కుమార్తె కూడా అపహరణకు గురవుతుంది. మరి హీరో తన అన్న కూతురును వెతికి పట్టుకున్నాడా? లేదా? అన్నదే చిన్నా సినిమా కథ. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యింటే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి. సిద్ధార్థ్‌ న‌ట జీవితంలోనే ఇది ఉత్త‌మ చిత్రం అంటూ విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకున్నారు. తప్పనిసరిగా జాతీయ అవార్డు సాధించే చిత్రంగా పేర్కొన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now