Adikeshava OTT Rights : ఆదికేశ‌వ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎందులో అంటే..?

November 25, 2023 2:13 PM

Adikeshava OTT Rights : మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం ఆదికేశవ‌.’ఉప్పెన’ వంటి బిగ్ సక్సెస్ తర్వాత వైష్ణవ్ తేజ్ పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అవి అత‌డికి మంచి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. ఈ క్ర‌మంలో మంచి హిట్ కొట్టాల‌నే క‌సితో ‘ఆదికేశవ’ అనే సినిమాను చేశాడు. కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే దర్శకుడు తెర‌కెక్కించిన ఈ మూవీ డివోషనల్ టచ్‌తో రూపొంద‌గా, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వచ్చింది.

‘ఆదికేశవ’ సినిమా సందడి ఇప్పటికే థియేటర్లలో మొదలైపోగా.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు కూడా బ‌య‌టకు వ‌చ్చాయి. తీవ్ర‌మైన పోటీ న‌డుమ ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు. ఇక, ఈ హక్కుల కోసం సదరు సంస్థ భారీ మొత్తాన్నే చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ ఆఖర్లో ఆదికేశవ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే, ఆదికేశవ శాటిలైట్ రైట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకుంది.

Adikeshava OTT Rights know the streaming details
Adikeshava OTT Rights

ఆదికేశవ’ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లపై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మించారు. జీవి ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు. శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌కి గోల్డెన్ లెగ్‌గా మార‌గా, ఈ మూవీకి డివైడ్ టాక్ రావ‌డంతో అమ్మ‌డి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.  ఇక‌ ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ సీన్లపై ట్రోల్స్ కూడా జోరుగా వస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now