Harati : క‌ర్పూరం, ల‌వంగాల‌తో ఇలా హార‌తి ఇవ్వండి చాలు.. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు..!

November 28, 2023 12:03 PM

Harati : ప్రతి ఒక్కరికి కూడా, ధనవంతులు అవ్వాలని, పేదరికం నుండి బయట పడాలని ఉంటుంది. ఐశ్వర్యం కలగాలని, కోరుకునే వాళ్ళు ఇలా వాస్తు ప్రకారం పాటించినట్లైతే, చక్కటి ప్రయోజనం ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇలా చేసినట్లయితే, లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక సమస్యలు అస్సలు ఉండవు. సంపద పెరుగుతుంది. చాలా మంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, రకరకాల పద్ధతుల్ని పాటిస్తారు. కానీ, ఇలా ఒకసారి చేస్తున్నట్లయితే, కచ్చితంగా ఫలితం ఉంటుంది.

కర్పూరం, లవంగాలు రెండు కలిపి కాల్చితే, చక్కటి ఫలితం ఉంటుంది. రెండూ కూడా మంచి సువాసనని ఇస్తాయి. పైగా లక్ష్మీ దేవికి ఇలా హారతి ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఒక ప్లేట్లో కానీ, ఒక దీపం కుందులో కానీ కర్పూరం అలానే ఓ రెండు లవంగాలు వేసి, కర్పూరాన్ని వెలిగిస్తే, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇంటికి శుభం కలుగుతుంది. డబ్బులు కూడా బాగా వస్తాయి.

give Harati to god with camphor and cloves for wealth
Harati

వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా, ఈ పద్ధతిని పాటించవచ్చు. అప్పుడు వ్యాపారంలో లాభాలు వస్తాయి. లవంగాలు, కర్పూరాన్ని కలిసి వెలిగించడం వలన ఏకాగ్రతని కూడా పెంచుకోవచ్చు. దీంతో మన పనులు పూర్తయిపోతాయి. రాత్రి సమయంలో వెలిగించడం వలన, చెడు శక్తుల ప్రవాహం తగ్గిపోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ అంతా దూరమైపోతుంది.

అలానే, శాంతి, సంతోషం కూడా కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత కూడా పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు కర్పూరం, లవంగాలు కలిపి వెలిగించడం వలన ప్రతికూల శక్తి తగ్గిపోయి, సంతోషంగా జీవించేందుకు అవుతుంది. కాబట్టి, కచ్చితంగా ఈ చిట్కాని పాటించండి. సమస్యలేమీ లేకుండా హాయిగా జీవించండి. అలానే, ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక బాధలేమి వుండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now