Vastu Dosham : ఇంట్లో వాస్తు దోషం ఉందని ఎలా తెలుసుకోవచ్చు..?

November 26, 2023 12:04 PM

Vastu Dosham : ఈ రోజుల్లో చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. నిజానికి మనం వాస్తు ప్రకారం పాటించడం వలన, చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలంటే, ప్రశాంతకరమైన వాతావరణాన్ని మనం ఏర్పరచుకోవాలి. వాస్తు దోషాలు ఉన్నట్లయితే, చాలా సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు అదృష్ట మహాగణపతి చిత్రపటాన్ని, మీ ఇంటి ముందు పెట్టుకుంటే, చాలా మంచి జరుగుతుంది. మనిషి యొక్క శరీరంలో అయస్కాంతం వంటి శక్తి కలిగి ఉంటుంది. అందుకనే, మనకి సరిపడని ప్రదేశాలకి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద, మనసు మీద కూడా పడుతుంది. తల తిరగడం, తలనొప్పి, చికాకు ఇటువంటివి కలుగుతూ ఉంటాయి.

అలానే, ఇంట్లో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఇల్లు చూస్తే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ దోషం కనపడదు. కానీ, ఆ ఇంటికి మారిన అప్పటినుండి కూడా చికాకు, అనారోగ్య సమస్యలు, టెన్షన్, ఆక్సిడెంట్లు ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. జాతకం ప్రకారం, ఎటువంటి దోషం లేకపోయినా కూడా ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అప్పులు చేయడం, చేసిన అప్పులు తీర్చలేక పోవడం, పిల్లలు పుట్టకపోవడం, కుటుంబంలో గొడవలు, ఆత్మహత్యలు ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటుంటాయి.

how to know Vastu Dosham is in house
Vastu Dosham

అనేక రకమైన వ్యాధుల బారిన పడడం, అవమానాలు ఎదుర్కోవడం ఇటువంటివి కూడా జరగొచ్చు. వీటన్నిటిని బట్టి మనం వాస్తు దోషం ఉందని తెలుసుకోవచ్చు. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు, కాకులు రావడం వంటివి జరిగితే కూడా వాస్తు లోపాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. వాస్తు దోషం ఉన్న ఇంటి చుట్టూ, కాకులు ప్రదక్షిణ చేయడం వంటివి కూడా కనబడుతూ ఉంటాయి. ఉద్యోగం లభించకపోవడం, చర్మవ్యాధులు వంటివి కూడా కలగొచ్చు.

ఇతరులను ప్రేమించడం, పుట్టింటికి చేరుకోవడం, కష్టాలు వంటివి కూడా వాస్తు దోషాల వలన కలుగుతాయి. కొన్ని ఇల్లులు చూడడానికి కళావిహీనంగా కనబడుతుంటాయి. కొన్ని చోట్లకి వెళ్తే, అకారణ భయం వంటివి కూడా కలుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటిని బట్టి మనం వాస్తు దోషం ఉందని తెలుసుకోవచ్చు. పండితులకి చూపించి, ఈ లోపాలు తెలుసుకుని, తగిన శాంతి చేస్తే సమస్య నుండి గట్టెక్కచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now